Double Ismart collections: ఫస్ట్ డే కలెక్షన్స్.. పూరీ దెబ్బకు రామ్ పరిస్థితి ఏంటి..?

Double Ismart collections.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరుపొందిన పూరీ జగన్నాథ్, ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. నిన్నటి రోజున అనగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా గతంలో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్.. నిన్నటి రోజున హీరో రవితేజ మిస్టర్ బచ్చన్, విక్రమ్ తంగలాన్ వంటి చిత్రాలు కూడా విడుదలయ్యాయి. అయితే ఇందులో మిస్టర్ బచ్చన్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను మూట కట్టుకుంది. ఆ సినిమాతో పోలిస్తే డబుల్ ఇస్మార్ట్ కాస్త బెటర్ అని పలువురు ప్రేక్షకులు తెలియజేశారు. కానీ పూరీ జగన్నాథ్ , రామ్ పోతినేని మార్కెట్ కి ఈ సినిమా అత్యంత దారుణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి మొదటి రోజు ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.

Double Ismart collections: First day collections.. What is Ram's condition due to Puri's blow..?
Double Ismart collections: First day collections.. What is Ram’s condition due to Puri’s blow..?

మొదటి షో తోనే బోల్తా కొట్టిన డబుల్ ఇస్మార్ట్..

డబుల్ ఇస్మార్ట్ లో హీరో రామ్ ఎనర్జీ, హీరోయిన్ కావ్య థాపర్ తో రొమాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రామ్ యాక్షన్ పీక్స్ అనే కామెంట్లు వినిపించాయి. కానీ థియేటర్లలో సినిమా చూసిన తర్వాత అభిమానులంతా నిరుత్సాహపడ్డారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా డబుల్ ఇస్మార్ట్ అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమానే తిప్పితిప్పి చూపించారనే విధంగా కూడా ప్రేక్షకులు తెలియజేశారు. ఇలాంటి చెత్త సినిమా తాము చూడలేదంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.

ప్రెస్టేజియస్ మూవీ.. మరి రామ్ పరిస్థితి ఏంటి..

అసలే పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా డిజాస్టర్ తర్వాత ప్రెస్టేజియస్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా కూడా బోల్తా కొట్టడంతో ఆయన అభిమానులు పూర్తిస్థాయిలో హార్ట్ అవుతున్నారని చెప్పవచ్చు. భారీ అంచనాల మధ్య అంతకుమించి ఎక్స్పెక్టేషన్స్ నడుమ విడుదలైన ఈ సినిమా ఎవరి అంచనాలను అందుకోలేకపోయింది. భారీగా డిజాస్టర్ మూటగట్టుకుంది. పూరీ జగన్నాథ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రామ్ కి కూడా విజయ్ దేవరకొండ లాగే తీరని నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. అటు పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాతో బొక్క బోర్ల పడ్డారనటంలో సందేహం లేదు.

- Advertisement -

ఫస్ట్ డే కలెక్షన్స్..

మరి డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలైన మొదటి రోజు ఏ మేరకు కలెక్షన్స్ రాబట్టింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా రూ .48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక అందులో భాగంగానే సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటిరోజు కేవలం రూ.7.35 కోట్లు మాత్రమే రాబట్టింది. ఒక్క తెలుగు నుండి మాత్రమే రూ.6.9 కోట్లు రాబడితే, హిందీ నుండి కేవలం రూ.45 లక్షలు మాత్రమే రావడం ఆశ్చర్యకరం. 60.1% థియేటర్ ఆక్యుపెన్సీ తో మార్నింగ్ షోస్ రన్ అయ్యాయి. కానీ సినిమా డిజాస్టర్ గా నిలిచిందని చెప్పవచ్చు. డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ కావాలి అంటే 40 కోట్ల రూపాయలు షేర్ రాబట్టాలి.. గతంలో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు కలెక్షన్స్ రూ .7.65 కోట్ల రూపాయల వరకు రాబట్టింది.. అయితే అప్పట్లో ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే కేవలం రూ .16 కోట్లు టార్గెట్ మాత్రమే ఉండేది.. అంతేకాకుండా ఇస్మార్ట్ శంకర్ కి రూ .80 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. మరి డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఏ మేరకు కలెక్షన్లు కొల్లగొడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు