Gam Gam Ganesha : గం గం గణేశా డే 1 లెక్క.. పోటీ దెబ్బ బానే పడింది..

Gam Gam Ganesha : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినా, డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దొరసాని అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకోగా, లాస్ట్ ఇయర్ బేబి మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ అయిన “గం గం గణేశా”(Gam Gam Ganesha) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ఈ సినిమా నుండి ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి సినిమాపై అంచనాలు పెంచేయగా, ఫైనల్ గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

Gam Gam Ganesha First day collections

టాక్ కి తగ్గట్టే ఓపెనింగ్స్..

శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయిన గం గం గణేశా (Gam Gam Ganesha) మూవీ థియేటర్లలో మూడు సినిమాలతో పోటీగా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా థియేటర్లలో యావరేజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. కాగా గం గం గణేశా ఫస్ట్ డే థియేటర్ల కలెక్షన్లు చూసుకుంటే అంతగా రాలేదని చెప్పాలి. ఓవరాల్ గా మూడు సినిమాల్లో సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా మొదటి రోజు బుక్ మై షో లో ఆల్ మోస్ట్ 11 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా, మొదటి రోజు మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా 55 – 60 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ 1.2 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజున 70 లక్షల రేంజ్ లో ఉండగా గ్రాస్ లెక్క 1.45 కోట్ల దాకా మొదటి రోజున సినిమా సొంతం చేసుకుంది

- Advertisement -

పోటీ వల్లే దెబ్బ..

ఇక ఈ సినిమాకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లను పక్కన బెడితే, సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 5.50 కోట్ల దాకా ఉండగా, ఇంకా 4.80 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనితో పాటు గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయువేగం సినిమాలు పోటీగా రిలీజ్ కావడం వల్ల ఈ సినిమాకు అంతగా ఓపెనింగ్స్ రాలేదని చెప్పాలి. ముఖ్యంగా సిటీ ఏరియాల్లో గం గణేశా కు బాగా దెబ్బ పడింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో మంచి గ్రోత్ ని చూపించి తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా స్టడీగా హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సినిమా వీకెండ్ లో ముందు ఎంత వరకు హోల్డ్ చూపిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు