Gam Gam Ganesha : డ్రాప్ అవుతాయనుకున్నా మంచి హోల్డ్..

Gam Gam Ganesha : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో ఒకటి “గం గం గణేశా” సినిమా. లాస్ట్ ఇయర్ బేబీ సినిమాతో బ్లాక్క్ బస్టర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉండేవి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్ల వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఫస్ట్ డే గం గం గణేశా (Gam Gam Ganesha) మూవీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ కనిపించినా కూడా డే ఎండ్ అయ్యే టైంకి ఆల్ మోస్ట్ డే 1 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద డే 2 ను బానే ఎండ్ చేసి బ్రేక్ ఈవెన్ వేటలోనే కొనసాగుతూ ఉండటం విశేషం.

Gam Gam Ganesha movie 2 days collections

రెండో రోజు మంచి హోల్డ్..

ఇక గం గణేశా సినిమా మొత్తం మీద మొదటి రోజు 60 లక్షల లోపు షేర్ ని అందుకున్న గం గం గణేశ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఆల్ మోస్ట్ 64 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది. వరల్డ్ వైడ్ గా 70 లక్షల లోపు షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. నైజాంలో 56 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ లో 68 లక్షలు రాబట్టగా, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 1.24 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక ఓవర్సీస్ సహా మరో 22 లక్షలు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో 1.46 కోట్ల షేర్ సాధించగా, గ్రాస్ 3 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా.

- Advertisement -

బ్రేక్ ఈవెన్ కష్టమే.. ?

అయితే ఈ రెండు రోజుల వసూళ్లతో గం గణేశా (Gam Gam Ganesha) డీసెంట్ వసూళ్ళని అందుకున్నా వర్కింగ్ డే లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఉంది. అయితే ఓవరాల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.50 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.04 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వీకెండ్ ని సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పూర్తి చేసుకుంటుందో చూడాలి. ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటించింది. కామెడీ రాబరీ ఆక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకోగా మాస్ సెంటర్లలో బాగా ఆడుతుంది. ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయువేగం సినిమాలు పోటీ ఉండడం వల్ల ఈ సినిమాకు దెబ్బ పడిందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు