Gam Gam Ganesha : ఓపెనింగ్ కలిసొచ్చినా వీకెండ్ దెబ్బేసింది.. ప్లాప్ తప్పదా?

Gam Gam Ganesha : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో ఒకటి “గం గం గణేశా” సినిమా. లాస్ట్ ఇయర్ బేబీ సినిమాతో బ్లాక్క్ బస్టర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ ఈ సారి గం గం గణేశా అంటూ కామెడీ యాక్షన్ డ్రామా తో వచ్చాడు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్ల వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఫస్ట్ డే గం గం గణేశా (Gam Gam Ganesha) మూవీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా రెండో రోజు కూడా మంచి వసూళ్లనే అందుకుంది. అయితే మూడో రోజు మాత్రం ఆశించినంత వసూళ్లు రాలేదు. మూడో రోజు ఆది వారం అయినా వర్షాల ప్రభావం వల్ల ఈవెనింగ్ నైట్ షో లలో ఎఫెక్ట్ పడింది. సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయినా కూడా ఓవరాల్ గా వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది కానీ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మాత్రం ఇంకా కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.

Gam Gam Ganesha weekend collections

వీకెండ్ కలెక్షన్స్ లెక్కేస్తే..

ఇక గం గం గణేశా సినిమా మూడో రోజు 44 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 48 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా కోటి రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. దాంతో సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. నైజాం 0.78 కోట్లు, ఆంధ్ర 0.90 కోట్లు టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 1.68 కోట్ల షేర్ రాబట్టగా, కర్ణాటక, ఓవర్సీస్ సహా మరో 26 లక్షలు కలుపుకుని వరల్డ్ వైడ్ గా గం గణేశా వీకెండ్ లో 1.95 కోట్ల షేర్ 4 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.50కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా ఇంకా 3.56 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

ప్లాప్ తప్పదా?

ఇక ఆనంద్ దేవరకొండ లాస్ట్ ఇయర్ తో బేబీ తో బ్లాక్ బస్టర్ దక్కించుకోగా, ఈ ఇయర్ మాత్రం గం గం గణేశా సినిమాతో ప్లాప్ అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే టార్గెట్ లో సగానికి పైగా వసూళ్లు రావాలి. అంటే వర్కింగ్ డే లో కూడా ఈ సినిమా హాలిడే లో పెర్ఫార్మ్ చేసినట్లు వసూళ్లు తేవాలి. అది దాదాపు కష్టమే అనిపిస్తుంది. పైగా రేపు ఎన్నికల ఫలితాల వల్ల జనాలు పెద్దగా థియేటర్లకు వెళ్లే ఛాన్స్ లేదు. దీన్ని బట్టి ఈ సినిమా ప్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ చూపిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు