Gangs of Godavari Collections : విశ్వక్ మూవీకి ఈ ఒక్కరోజే టైం… బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Gangs of Godavari Collections : గత వారాంతంలో థియేటర్లలోకి వచ్చిన మూడు సినిమాలు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,” “గం గం గణేశ,” “భజే వాయు వేగం”. ఈ మూడింటిలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”కే మంచి రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ మూడింటిలో విశ్వక్ మూవీనే ఎక్కువ కలెక్షన్లు అందుకుంది. మూడు రోజుల్లో ఏ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టగలిగింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధ్యమేనా? అనే వివరాల్లోకి వెళ్తే..

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఫస్ట్ వీకెండ్ 82% కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలను సేఫ్ జోన్ లో పడేసింది. వాస్తవానికి ఈ మూవీకి నెగెటివ్ రివ్యూలు, నెగెటివ్ మౌత్ టాక్ వచ్చాయి. కానీ ఈ వీకెండ్ రిలీజైన 3 సినిమాలలో ఎంతో కొంత ఈ మూవీనే బెస్ట్ అని ప్రేక్షకులు భావించడం వల్ల కలెక్షన్ల పరంగా ఫరవాలేదనిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో కలిపి ఫస్ట్ వీకెండ్ కే ఈ మూవీ 6.6 కోట్లను కొల్లగొట్టింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ 8 కోట్లు. అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇంకా 2 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంటుంది. కానీ ఆ రెండు కోట్లు రాబట్టడానికి ఈ మూవీకి ఇంకా ఒక్క రోజే టైమ్ ఉంది.

Gangs of Godavari review: Vishwak Sen, Neha Sshetty, Anjali's film falls short of being compelling - Hindustan Times

- Advertisement -

ఈ ఒక్క రోజే టైమ్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కలెక్షన్స్ పై ఎలెక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్ కూడా స్ట్రాంగ్ గానే పడింది. జూన్ 4 న ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ప్రస్తుతం దేశం అంతా ఎగ్జిట్ పోల్స్ ఫీవర్ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలవబోయేది ఎవరు ? అన్న విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక ఎలెక్షన్ రిజల్ట్స్ కి మరో కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ కొన్ని గంటల్లోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను రాబట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే నిర్మాతలకు నష్టం తప్పదు. మరి ఈ ఒక్క రోజులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

మిగతా రెండు సినిమాల పరిస్థితి ఇదీ

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ సంగతిని పక్కన పెడితే మిగతా రెండు సినిమాల పరిస్థితి దారుణంగా ఉంది. నిజానికి కార్తికేయ నటించిన “భజే వాయు వేగం” ఈ వీకెండ్ విడుదలైన మూడు చిత్రాలలో ఉత్తమ కథనంతో ఆసక్తికరంగా ఉంది. కానీ ప్రస్తుతం థియేటర్లలో నెలకొన్న పోటీ, ఎలెక్షన్ రిజల్ట్స్ ఫీవర్ కారణంగా ఈ మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో హీరో కార్తికేయతో పాటు నిర్మాతలకు నిరాశ తప్పలేదు.

భజే వాయు వేగం మూవీ కంటే ఆనంద్ దేవరకొండ నటించిన “గం గం గణేశ” సినిమా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఆ రెండు సినిమాలు ఫరవాలేదు అన్పిస్తే ఈ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేదేమో. కానీ విశ్వక్, కార్తికేయ సినిమాలతో పోటీ పడడం వల్ల ఈ మూవీకి కలెక్షన్ల పరంగా పెద్ద దెబ్బే పడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు