Gangs Of Godavari : గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఫస్ట్ వీక్ లెక్క.. బ్రేక్ ఈవెన్ కి ఎంతదూరమంటే!

Gangs Of Godavari : టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” (Gangs Of Godavari) సినిమా గత వారం మే31న థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్లలో ఆ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకోగా, మంచి క్రేజ్ ఉండడంతో భారీ ఓపెనింగ్స్ సాధించింది. విశ్వక్ సేన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా, వర్కింగ్ డేస్ లో మాత్రం స్లో అయింది. ఇక తాజాగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని, మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా మంచి కలెక్షన్స్ దక్కించుకుని, రెండో వారంలోకి అడుగుపెట్టింది. అయితే గ్యాంగ్స్ ఆప్ గోదావరి సినిమాకి రిలీజ్ కి ముందున్న హైప్ ని బట్టి, యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఉంటే వసూళ్లు ఇంకా ఎక్కువగా సొంతం అయ్యి ఉండేవి. అయినా పర్వాలేదనిపంచేలా వసూళ్లు వచ్చాయి.

Gangs Of Godavari First Week Collections

డీసెంట్ కలెక్షన్లతో అదరగొట్టిన గోదావరోళ్ళు..

ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి (Gangs Of Godavari) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో డీసెంట్ హోల్డ్ ని చూపించగా, ఈ సినిమా 6వ రోజు 37 లక్షల షేర్ ని అందుకుంటే 7వ రోజుకి వచ్చే సరికి 6 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి ఓవరాల్ గా 31 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 70 లక్షల రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా, ఇప్పుడు మొదటి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాంలో 3.23 కోట్లు, సీడెడ్ 1.58 కోట్లు, ఉత్తరాంధ్ర 98 లక్షలు, ఈస్ట్ 67లక్షలు, వెస్ట్ 51 లక్షలు, గుంటూరు 61 లక్షలు, కృష్ణ 51 లక్షలు, నెల్లూరు 37 లక్షలు రాబట్టగా, టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 8. 46 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి మరో 62 లక్షలు వసూలు చేయగా, ఓవర్సీస్ లో 1.12 కోట్ల షేర్ వసూలు చేసింది.

- Advertisement -

బ్రేక్ ఈవెన్ కి మరో వీకెండ్ కావాలి?

ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా మొదటివారం వరల్డ్ వైడ్ గా 10.20 కోట్ల షేర్ వసూలు చేయగా, 18.70 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఓవరాల్ గా ఈ సినిమా 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా, ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ అయి, క్లీన్ హిట్ కావాలంటే ఇంకా 80 లక్షల దూరంలో ఉంది. రెండో వీక్ లో డీసెంట్ హోల్డ్ ని సినిమా చూపిస్తే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అయితే సినిమాకి పెద్దగా లాభాలు వచ్చే అవకాశం లేదనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వారం కొత్త సినిమాలు రిలీజ్ కాగా, ఈ సినిమాని చాలా థియేటర్లలో తీసేసారు. మరి లాంగ్ రన్ లో గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఎంతవరకు పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు