Gangs Of Godavari : రెండో రోజు సగం డ్రాప్..మాస్ సెంటర్లపైనే భారం?

Gangs Of Godavari : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన క్రేజి సినిమాల్లో “గ్యాంగ్స్ అఫ్ గోదావరి” సినిమా కూడా ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమాపై ముందునుండి భారీ అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇక అంచనాలకు తగ్గట్టే ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మొదటి రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, సినిమా కి మిక్సుడ్ టాక్ రావడం రెండో రోజు కొంచం ఇంపాక్ట్ చూపించింది. కానీ పోటీలో కూడా ఈ మాత్రం కలెక్షన్లు రావడం గ్రేట్ అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండో రోజుకి వచ్చేసరికి డ్రాప్స్ కొంచం కనిపించినా ఓవరాల్ గా అనుకున్న రేంజ్ కి కొంచం అటూ ఇటూగా వసూల్ చేసింది.

Gangs of Godavari movie 2days collections

రెండో రోజు సగం డ్రాప్స్..

ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి (Gangs Of Godavari) సినిమా రెండో రోజు 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా, మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు కంప్లీట్ అయ్యే టైం కి 1.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.80 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 3.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను రెండో రోజున సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. నైజాంలో 1.82 కోట్ల షేర్, సీడెడ్ లో 1.00 కోట్ల షేర్, ఆంధ్ర లో 2.78 కోట్ల షేర్ రాబట్టగా, తెలుగు రాష్ట్రాల్లో 5.6 కోట్ల షేర్ రాబట్టింది. ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియాలో కలిపి 35 లక్షల, ఓవర్సీస్ లో 0.85 లక్షలు రాబట్టిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో 6.26 కోట్ల షేర్ 11.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

- Advertisement -

బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా..

ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా రెండు రోజులు పూర్తి అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 4.74 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకోవడం వల్ల టార్గెట్ తగ్గిందని చెప్పాలి. ఇక ఆదివారం హోల్డ్ ని బట్టి సినిమా మొదటివారంలోనే బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే విషయం చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లు గా నటించిన విషయం తెలిసిందే. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు