Garudan : కోలీవుడ్ లో రెండో బ్లాక్ బస్టర్.. రెండు వారాల్లో ఎన్ని కోట్లంటే..!

Garudan : మామూలుగా కామెడీ యాక్టర్స్ సినిమాల్లో కామెడీ చేస్తేనే జనాలు ఎక్కువగా ఇష్టపడతారు అనుకుంటారు కొందరు. కానీ అప్పుడప్పుడు కొందరు కామెడీతో పాటు సీరియస్ రోల్స్ తో కూడా మెప్పిస్తూ ఉంటారు. అది హీరో రోల్ అయినా, లేక విలన్ అయినా, లేక మరేదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ అయినా, వాళ్ళు ఇరగదీస్తారు. ఇక కోలివుడ్ లో కామెడీ మూవీస్ తో మంచి పేరుని సొంతం చేసుకుని అప్పుడప్పుడు సీరియస్ మూవీస్ తో కూడా మెప్పించే సూరి లేటెస్ట్ గా నటించిన సీరియస్ మూవీ “గరుడన్”. ఈ సినిమా గత నెల మే31న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక తాజాగా విడుదలైన “గరుడన్” సినిమాని కోలీవుడ్ విలక్షణ దర్శకుడు వెట్రీమార‌న్ క‌థ అందించి స్వ‌యంగా నిర్మించారు. ఇందులో సూరి హీరోగా నటించగా, ఉన్ని ముకుంద‌న్, శ‌శికుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు. దురై సెంథిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ సినిమాకి మంచి టాక్ వ‌చ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ సొంతం అయ్యాయి. తమిళ్ లో ఈ ఇయర్ అరణ్మనై4 మూవీ ఒక్కటే ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు రెండో బ్లాక్ బస్టర్ హిట్ గా గరుడన్ సినిమా నిలిచింది.

Garudan movie 12 days collections

భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న గరుడన్..

ఇక కోలీవుడ్ లో ఈ ఏడాది అరణ్మణై 4 సినిమా ఏ సినిమా కూడా ఆశించిన హిట్ కాలేదు. ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఇప్పుడు గరుడన్ మూవీ రెండో బ్లాక్ బస్టర్ హిట్ గా తమిళ్ లో దూసుకు పోతూ ఉండగా ఆల్ మోస్ట్ 50 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా, లాంగ్ రన్ ను సూపర్ స్టడీ గా సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద గరుడన్ సినిమా 12 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… తమిళనాడులో 38.05 కోట్ల గ్రాస్, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 3.25 కోట్ల గ్రాస్ రాగా, ఓవర్సీస్ లో 6.65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 23.05 కోట్ల షేర్, 47.95 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక 13 వ రోజు లేదా 14 వ రోజు కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు 50 కోట్ల క్లబ్ లో చేరబోతుండగా, సూరి కెరీర్ లోనే ఇవి ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి.

- Advertisement -

లాంగ్ రన్ లో వంద కొడుతుందా?

ఇక గరుడన్ (Garudan) సినిమా తమిళనాడులో మంచి స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకు పోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో తమిళనాడులోనే 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే అరణ్మణై4 సినిమా లాంగ్ రన్ లో స్టడీ కలెక్షన్లతో వంద కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు గరుడన్ సినిమా కూడా లాంగ్ రన్ లో వంద కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు నెటిజన్లు. కానీ ఇతర సినిమాలు పోటీగా ఉండకుంటే ఆ ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ వారం విజయ్ సేతుపతి నటించిన మహారాజా విడుదలవుతుంది. మరి దాన్ని తట్టుకుని గరుడన్ ఎంత వరకు స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు