Haromhara : సుధీర్ బాబు అంత కష్టపడ్డా ప్రయోజనం లేకుండా పోయింది..!

Haromhara : బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వారం రిలీజ్ అయిన క్రేజీ సినిమాలలో “హరోంహర” సినిమా ఒకటి. గత కొంత కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న “సుదీర్ బాబు” నటించిన లేటెస్ట్ మూవీ ‘హరోం హర’ సినిమా మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ కాగా, మాస్ ఆడియన్స్ నుండి మిక్సడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రీసెంట్ టైంలో సుదీర్ బాబు కెరీర్ లో మంచి కలెక్షన్స్ ని అందుకుంది. కానీ అనూహ్యంగా రెండో రోజు నుండే సినిమాకి డ్రాప్స్ రావడం మొదలయ్యాయి. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి గ్రోత్ రాకపోయినా కనీసం మంచి హోల్డ్ ని అయినా చూపిస్తుంది అనుకున్నారు కానీ మొదటి రోజు తర్వాత హరోంహర ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అదీ గాక విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా ఇంపాక్ట్ ఈ సినిమాపై బాగా పడింది అని చెప్పాలి. ఏం జరిగిందో తెలీదు గాని చాలా చోట్ల థియేటర్ల వద్ద జనాలు లేక వేరే సినిమాలు భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Haromhara movie 4 days collections

పండగ అడ్వాంటేజ్ కూడా వాడుకోలేకపోయింది…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర హరోం హర ఎలాంటి హోల్డ్ కూడా చూపించలేకపోయిన హరోంహర కనీసం ఆదివారం అడ్వాంటేజ్ తో అయినా హోల్డ్ చూపిస్తుందనుకుంటే అక్కడా దెబ్బ పడగా, మాస్ సెంటర్స్ లో అయినా హోల్డ్ ని చూపిస్తుంది అనుకున్నా కూడా వీకెండ్ లో ఆశించిన మేర గ్రోత్ ని చూపించ లేక పోయింది. ఇక హరోం హర మూవీ 4వ రోజు బక్రీద్ పండగ అడ్వాంటేజ్ లభించినా కూడా పెద్దగా జోరు ని చూపించ లేక పోయింది. మొత్తం మీద 3వ రోజుతో పోల్చితే 50% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇక తేరుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. మొత్తం మీద 3వ రోజున 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 4వ రోజుకి వచ్చే సరికి 24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ గా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాం 90 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ 1.08 కోట్లు రాగా, కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని ఏరియాలు కలిపి మరో 30 లక్షలు రాబట్టింది. ఓవరాల్ గా నాలుగు రోజుల్లో 2.28 కోట్ల షేర్ మాత్రం వసూలు చేసింది.

- Advertisement -

సుధీర్ బాబు కష్టానికి ప్రయోజనం లేకుండా పోయింది…

ఇక హరోం హర సినిమా మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 4.22 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ సినిమా బాక్స్ అఫీస్ దగ్గర రన్ అవడం కష్టమే అని చెప్పాలి. ఈ సినిమా కోసం సుధీర్ బాబు చాలా కష్టపడ్డాడు. ఏడాది పాటు మాస్ మేకోవర్ చేసి, సినిమా ప్రమోషన్లను కూడా దగ్గరుండి చూసుకున్నాడు. కానీ ఏది ఏమైనా సినిమా ప్లాప్ కావడం మాత్రం ఆపలేకపోయారు. ఇప్పటికైనా సినిమా కొంచెమైనా హోల్డ్ చేయకపోతే సినిమాకి దారుణమైన రిజల్ట్ తప్పదని తెలుస్తుంది. మరి మిగతా రోజుల్లో ఏమాత్రం నష్టాన్ని తగ్గించడానికి మేకర్స్ ప్రయత్నిస్తారో చూడాలి.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు