Indian 2 : భారతీయుడు 2 తెలుగు బ్రేక్ ఈవెన్ టార్గెట్… బిగ్ రిస్క్ చేస్తున్నారా?

Indian 2 : 28 ఏళ్ల తర్వాత సేనాపతి తిరిగి థియేటర్లలోకి రాబోతున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం లంచం తీసుకునే అవినీతిపరుల గుండెల్లో మరణ దండన శిక్షతో గుబులు పుట్టించాడు భారతీయుడు. ఆ సినిమాలో కమల్ హాసన్ నట విశ్వరూపం చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దానికి సీక్వెల్ కి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన కమల్ హాసన్ అభిమానుల కలలు నిజమయ్యే క్షణం మరో మూడు రోజుల్లో రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు జరిగిన తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఎవరికైనా సరే బిగ్ రిస్క్ చేస్తున్నారా అని డౌట్ వస్తోంది.

బిగ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్

భారతీయుడు సినిమాలో సమాజంలో జరిగే తప్పులను తనదైన కోణంలో ఎత్తి చూపారు డైరెక్టర్ శంకర్. పైగా ఆ కథకి కమర్షియల్ హంగులు అద్ది మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేస్తాడు. ఇప్పుడు భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు 2లో కూడా దాదాపుగా ఇదే పని చేయబోతున్నారు. ఈ సినిమాలో సొసైటీలో పెరిగిపోయిన కరప్షన్ ను మెయిన్ గా టార్గెట్ చేస్తున్నట్టు ట్రైలర్ లో చూపించారు శంకర్. అయితే ఈసారి ప్రేక్షకులకు తగ్గట్టుగా ఆలోచనలకు తగ్గట్టుగా ఎలాంటి కథతో డైరెక్టర్ థియేటర్లలోకి రాబోతున్నాడో చూడాలి.

Bharateeyudu 2 Pre Release Event Details Out | cinejosh.com

- Advertisement -

భారతీయుడు 2 మూవీ జూలై 12న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకు తెలుగులో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఆంధ్రాలో 12 కోట్లు, నైజాంలో 9 కోట్లు, సీడెడ్ లో 4 కోట్లు, ఓవరాల్ గా చూసుకుంటే 25 కోట్ల బిజినెస్ జరగడం విశేషం. శంకర్ ఇమేజ్, కమల హాసన్ స్టార్ స్టేటస్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే నిజానికి ఈ బిజినెస్ తక్కువ అని చెప్పాలి. కానీ ప్రస్తుతం భారతీయుడు 2 మూవీ విషయంలో చూస్తే ఇది చాలా ఎక్కువ.

రిస్క్ చేస్తున్నారా ?

శంకర్ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఫేమస్ ఉండడంతో బిజినెస్ బాగానే జరుగుతుంది. కానీ శంకర్ గత సినిమాలు ఐ 2.0 సినిమాలు చూసుకుంటే నిర్మాతలకు భారీ నష్టాలు మిగిలాయి. ఈ నేపథ్యంలోనే వస్తున్న భారతీయుడు 2పై తెలుగు రాష్ట్రాలలో అస్సలు బజ్ లేదు. ఏదో భారతీయుడు చిత్రానికి సీక్వెల్ అన్నమాటే గాని ఆ బ్రాండ్ ఇమేజ్ కు తగ్గ హైప్ అయితే లేనేలేదు. కనీసం మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్లోనే నిర్వహించినప్పటికీ పబ్లిక్ లో ఈ మూవీ గురించి చర్చ జరగట్లేదు. మరి ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప భారతీయుడు 2 తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద 26 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ అవ్వదు. కానీ ఈ టార్గెట్ ను రీచ్ అయితేనే మూవీ హిట్ అయినట్టు లెక్క. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే జూలై 12న భారతీయుడు 2 తెరపైకి దాకా వెయిట్ అండ్ సి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు