Indian2 Collections : కమల్ ను తమిళ్ తంబిలే రిజెక్ట్ చేశారు… ఫస్ట్ డే దారుణమైన కలెక్షన్స్

Indian2 Collections : ఉలగనాయగన్ కమల్ హాసన్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో చాలా రోజుల నుండి ఊరిస్తూ వచ్చిన ఇండియన్2 సినిమా ఎట్టకేలకు థియేటర్లలో జులై 12న విడుదలైంది. నాలుగేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో థియేటర్లలో విడుదల కాగా సినిమా ఆశించినంత రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. ఓపెన్ గా చెప్పాలంటే ప్లాప్ టాకే వచ్చిందని చెప్పాలి. కమల్ హాసన్ సేనాపతి పాత్రలో మళ్ళీ అలరించినా, ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు వచ్చిన వైబ్స్ కానీ, ఎమోషన్ కానీ ఈ రెండో పార్ట్ లో పండలేదన్నది ప్రేక్షకుల మాట. ఇక తెలుగులో భారతీయుడు2 పేరుతో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా నిరాశపరచగా శంకర్ కమల్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ అయినా గ్రాండ్ గా వస్తాయని మేకర్స్ అనుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ డే కల్లెక్షన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉండగా, తాజాగా వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్లు చూసి షాక్ అయ్యారు నిర్మాతలు.

Indian 2 first day world wide Collections

సొంత ప్రేక్షకులే దెబ్బేసారు…

ఇక కమల్ హాసన్ నటించిన ఇండియన్2 (Indian2 Collections) సినిమాను చూసి అన్ని భాషల ఆడియన్స్ నిరాశ చెందగా, తెలుగులో ఈ సినిమాకి ఓ మోస్తరు ఓపెనింగ్స్ అయినా వచ్చాయి. అయితే ఇండియన్2 సినిమాకు సొంత ప్రేక్షకులే దెబ్బేయడం గమనార్హం. అవును.. ఇండియన్2 సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తుందని మేకర్స్ ఆశపడగా తమిళ తంబీలే ఈ సినిమాను దారుణంగా రిజెక్ట్ చేసారు. ఇండియన్2 విడుదలైన ఫస్ట్ డే తమిళ నాడు లో 13.40 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయడం షాకింగ్ కి గురి చేసింది. కమల్ లాంటి హీరోకు శంకర్ లాంటి దర్శకుల సినిమాలకు వచ్చే కలెక్షన్లు కావివి. ఇంకా తెలుగు ప్రేక్షకులే భారతీయుడుని ఒక రకంగా ఆదరించారని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 10.80 కోట్ల వరకు వసూలు చేయడం విశేషం. అనే తమిళనాడు కలెక్షన్లకు ఆల్మోస్ట్ ఈక్వెల్.

- Advertisement -

ఇండియన్2 వరల్డ్ వైడ్ లెక్క..

ఇక ఇండియన్2 సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రాబట్టిన కలెక్షన్ల లెక్క ఈ విధంగా ఉంది.
తమిళ నాడు – 13.40 కోట్లు
తెలుగు స్టేట్స్ – 10. 80 కోట్లు
కర్ణాటక – 3.40 కోట్లు
కేరళ – 2.35 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 1.80 కోట్లు
ఓవర్సీస్ – 26.25 కోట్లు

ఓవరాల్ గా ఇండియన్2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 58.10 కోట్ల గ్రాస్ ని 28.50 కోట్ల షేర్ ని వసూలు చేసింది. అయితే థియేట్రికల్ బిజినెస్ పరంగా 170 కోట్ల బిజినెస్ చేసిన ఇండియన్2 బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 143.5 కోట్లు రాబట్టాలి. అంటే ఈ వీకెండ్ లో ఇండియన్2 స్ట్రాంగ్ హోల్డ్ చూపించాల్సి ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ హోల్డ్ ఉన్నట్టు జరుగుతున్న బుకింగ్స్ తో తెలుస్తుంది. మరి ఎన్నో అంచనాలు పెట్టుకున్న నిర్మాతలను తమిళ తంబీలే దెబ్బేయగా, తెలుగు ఆడియన్స్ కొంత వరకు ఆదరిస్తున్నారు. మరి రెండో రోజు ఇండియన్2 లెక్క ఎలా ఉంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు