Indian2 Collections : భారతీయుడు2 రెండో రోజు ఎంత వరకు హోల్డ్ చూపించిందంటే?

Indian2 Collections : కమల్ హాసన్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కిన ఇండియన్2 సినిమా ఎట్టకేలకు జులై 12న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సినిమాపై ముందునుండే ప్రేక్షకుల్లో కాస్త తక్కువ అంచనాలే ఉండగా, ట్రైలర్ తో ఆసక్తి పెరిగింది. కానీ థియేటర్లలో ఇండియన్ తాతని చుసిన ప్రేక్షకులు విసుగు చెందారు. ల్యాగ్ ఎక్కువైందని బోరింగ్ స్క్రీన్ ప్లే తో సాగదీశారని ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. అయితే కమల్ – శంకర్ కాంబో హైప్ వల్ల ఈ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు తొలిరోజు బాగానే వచ్చారు. కానీ సినిమా నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, అభిమానులే ఈ సినిమాని రిజెక్ట్ చేసారు. ఇక అంతా కామన్ ఆడియన్స్ చేతిలోనే ఉందని చెప్పాలి. తొలిరోజు సాయంత్రానికి ఫైనల్ గా బీలో యావరేజ్ అన్న టాక్ రావడంతో ఓపెనింగ్స్ పరంగా డీసెంట్ అనిపించుకుంది. ఇక తాజాగా ఇండియన్2 (Indian2 Collections) రెండో రోజు కలెక్షన్స్ డీటెయిల్స్ బయటిక్ వచ్చాయి.

Indian2 Movie Two Days Worldwide Collections

రెండో రోజు హోల్డ్ చేసిందా లేదా?

ఇక మొదటి రోజు ఇండియన్2 వరల్డ్ వైడ్ గా 58 కోట్ల లోపు గ్రాస్ వసూలు చేసింది. అయితే అందులో సగం వసూళ్లు ఓవర్సీస్ నుండే రాగా, ఇండియాలో ఆశించినంత ఓపెనింగ్స్ రాలేదని చెప్పాలి. ఇక రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే… వరల్డ్ వైడ్ గా రెండో రోజు 14 కోట్ల షేర్ , 29.20 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. తమిళ నాడులో మొదటి రోజుతో ఈక్వల్ గా వసూళ్లు రాబట్టగా, తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఇక రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 42.50 కోట్ల షేర్, 87.30 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది ఇండియన్2. అయితే 170 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ కాగా, వచ్చిన వసూళ్ళని తీసేయగా, బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 129 కోట్ల దాకా రాబట్టాలి. ఇది జరగదని తేలిపోయింది. కానీ నష్టాలు ఎంతవరకు తగ్గించగలదో చూడాలి.

- Advertisement -

20 నిముషాలు ట్రిమ్ చేసిన మేకర్స్…

ఇక ఇండియన్2 సినిమాకి ఇంత నెగిటివ్ రెస్పాన్స్ రావడానికి కారణం బోరింగ్ స్క్రీన్ ప్లే, అలాగే ల్యాగ్ ఎక్కువ కావడమే అని చెప్పొచ్చు. అందుకే మేకర్స్ ఈ విషయాన్నీ గ్రహించి ఏకంగా 20 నిమిషాల పాటు ట్రిమ్ చేసారని సమాచారం. ఇక ఇప్పటినుండే సినిమా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త నచ్చితే కొంత మేర సినిమాకి నష్టాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఇక మూడో రోజు ఆదివారం కావడంతో ఇండియన్2 కొంత వారు గ్రోత్ చూపించే అవకాశం ఉందని చెప్పాలి. మూడో రోజు 15 నుండి 18 కోట్ల షేర్ వసూలు చేయొచ్చని బుకింగ్స్ ద్వారా తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు