Kalki 2898 AD Collections : కల్కి బాగానే లాక్కొచ్చింది… కానీ, ఆ రికార్డులకు చాలా దూరం

Kalki 2898 AD Collections: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి.. ఈ సినిమా గత నెల 27 న థియేటర్లలోకి వచ్చింది.. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం మాత్రమే కాదు.. కాసుల వర్షం కురిపిస్తుంది.. ప్రభాస్ కెరీర్‌లోనే ఈ సినిమా అద్బుతమైన కలెక్షన్లను రాబడుతూ ఇంకా 28 రోజుల తర్వాత కూడా నిలకడగా వసూళ్లను రాబడుతున్నది.. ఫస్ట్ డే ఏకంగా 191 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత కాస్త డౌన్ అయ్యిన కూడా మళ్లీ స్పీడును పెంచేసింది.. ఇప్పటివరకు ఈ మూవీ 1100 కోట్లకు పై రాబట్టినట్లు మేకర్స్ అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు..

స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ 28 రోజుల తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘనత అంతా ఇంతా కాదు.. మొదటి వారం ఏకంగా ఏకంగా 415 కోట్లకు పై రాబట్టింది.. రెండు వారంకు సగానికి పడిపోయింది.. 129 కోట్లు రాబట్టింది.. ఇక మూడో వారానికి గాను 56 కోట్లు కొల్లగొట్టింది.. నాలుగు వారాలకు బాగానే రాబట్టింది.. సినిమా వచ్చి నెల దాటినా కూడా కలెక్షన్స్ తగ్గడం లేదు.. ఈ వారంకు గాను మొత్తంగా 1100 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది..

kalki 2898AD 28 days box office collections
kalki 2898AD 28 days box office collections

సినిమా కథ కొత్తగా ఉండటంతో సినిమాను రెండు, మూడు సార్లు కూడా జనాలు సినిమాను చూస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే కలెక్షన్ల జోరు తగ్గలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో 280 కోట్ల రూపాయల గ్రాస్, ఇండియాలో 635 కోట్లు నికరంగా, 790 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. 1070 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.. ప్రస్తుతం 1100 కోట్ల గ్రాస్ ను దాటేసింది.. ఎలా చూసుకున్న త్రిపుల్ ఆర్ రికార్డ్ ను బ్రేక్ చెయ్యలేదని తెలుస్తుంది.. బాహుబలి 1810 కోట్ల రూపాయలు, RRR 1236 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డును సెట్ చేశాయి. తాజాగా కల్కి చిత్రం సుమారుగా 1100 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూల్ చేసి మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. మరి ఇంకా పెరుగుతాయేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు