Kalki 2898 AD Collections : 15 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా… ఏరియా వైజ్ కల్కి లెక్కలు

Kalki 2898 AD Collections : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. కేవలం 15 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి రెబల్ రాంపేజ్ చూపిస్తోంది. జూన్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ జోరు మూడో వారంలోకి అడుగు పెట్టినా ఇంకా నడుస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే 15 రోజుల్లో కల్కి మూవీ సాధించిన 1000 కోట్లకు పైగా కలెక్షన్ల లెక్కలు ఏరియా వైజ్ (ప్రపంచవ్యాప్తంగా) బయటకు వచ్చాయి. మరి ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఈ మూవీ 15 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందో చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా ఏరియా వైజ్ లెక్కలు…

కల్కి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా తెలుగు రాష్ట్రాల గురించే చెప్పుకోవాలి. ప్రభాస్ స్టార్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అలాంటిది మరి. నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఆయన అంతకంటే ముందు ఆయన తెలుగువాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయినప్పటికీ అన్ని చోట్లకంటే ఎక్కువ ఎఫెక్టివ్ గా ఆడేది తెలుగులోనే. ఇక మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే…

ఆంధ్రప్రదేశ్ – రూ. 150.50 కోట్లు
తెలంగాణ – రూ. 158.20 కోట్లు
కర్ణాటక – రూ. 69.40 కోట్లు
తమిళనాడు – రూ. 44.10 కోట్లు
కేరళ – రూ. 26.70 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 288 కోట్లు
నార్త్ అమెరికా – రూ. 141 కోట్లు
ఐర్లాండ్ – రూ. 16 కోట్లు
యూఏఈ-జీసిసి – రూ. 35 కోట్లు
జర్మనీ – రూ. 3.35 కోట్లు
మలేషియా – రూ. 5 కోట్లు
సింగపూర్ – రూ. 4 కోట్లు
శ్రీలంక – రూ. 14.50 కోట్లు
ఆస్ట్రేలియా – రూ. 16.25 కోట్లు
న్యూజిలాండ్ – రూ. 2 కోట్లు
రెస్ట్ ఆఫ్ యూరోప్ – రూ. 6. 50 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ – 17 కోట్లు
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కల్కి రూ. 1004 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

- Advertisement -

1000 కోట్లు దాటేసిన కల్కి 2898 AD.. అమితాబ్ సంచలన ట్వీట్‌తో ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ! | Kalki 2898 AD crossed 1000 Crores Collections: Amitabh Bachchan confirms officially - Telugu Filmibeat

నిర్మాతలకు కాసుల వర్షం

కల్కి మూవీ ఊహించినట్టుగానే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఆకశాన్ని తాకే అంచనాలతో మోస్ట్ అవైటెడ్ మూవీగా 372 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ 15 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లతో కుమ్మేసింది. నిజానికి ఈ మూవీ 2000 కోట్లను రాబడుతుందని అంతా ఆశించారు. ఆ ఆశ తీరకపోయినప్పటికీ ప్రభాస్ 1000 కోట్ల క్లబ్ లో చేరడం అనేది అందరిని సంతోషంలో ముంచెత్తుతోంది. ఇక ఇప్పటిదాకా కల్కి మూవీ సాధించిన కలెక్షన్స్ తో ఈ సినిమా దాదాపు 90 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. దీంతో నిర్మాతలు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తాజాగా రిలీజైన ఇండియన్ 2 సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి జోరు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరి కల్కి ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో తెలియాలంటే క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలు బయటకు వచ్చేదాకా వెయిట్ అండ్ సీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు