Kalki Collections : వీకెండ్ గట్టిగానే ఉంది… ఒక్కసారిగా పెరిగిన కలెక్షన్లు..

Kalki Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి రిలీజ్ అయ్యి రెండు రోజులు అవుతుంది.. ప్రభాస్ సినిమా కలెక్షన్స్ గురించి చెప్పనక్కర్లేదు.. ఈ సినిమా కూడా మొదటి రోజు భారీ కలెక్షన్స్ ను రాబట్టింది.. బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ సూపర్ హీరో మూవీ మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటింది.. ప్రస్తుతం కలెక్షన్ల మోత మోగిపోతుంది.. నిన్న వీకెండ్ కావడంతో సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. రెండు రోజులకు కల్కి ఎంత కలెక్షన్స్ రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం..

శనివారం రోజు ప్రభాస్‌ మూవీకి వరల్డ్ వైడ్‌గా 117 కోట్ల గ్రాస్ ను దాటేసిందని తెలుస్తుంది.. అంటే మొత్తం మీద 415 కోట్లను వసూల్ చేసింది.. ఇక ఇండియాలో సుమారుగా ఈ చిత్రం 80 కోట్ల కు పైగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా మూడో రోజు 415 కోట్ల కలెక్షన్స్ వరకు చేరి రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమా ఈరోజు ఆదివారం ఎంత సాధిస్తుందో వేచి చూడాలి.

kalki 2898 AD second day world wide collections
kalki 2898 AD second day world wide collections

ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ నటించిన విషయం తెలిసిందే.. ప్రతి ఒక్కరు అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరిచారు.. మొత్తం మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ.. అది సినిమా కలెక్షన్ల పైన ఏమాత్రం ఎఫెక్ట్ చూపించడం లేదు. ప్రభాస్ అదిరిపోయే పర్ఫామెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణం తో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది.. ప్రస్తుతానికి సినిమా పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతుంది.. గతంలో వచ్చిన సలార్ రికార్డులు ఈ కలెక్షన్స్ తో తుడిచిపెట్టాయి.. టిక్కెట్లు దొరకడం లేదు కాబట్టి ఇంకా ముందు ముందు కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.. మరో విషయమేంటంటే.. పార్ట్ 2 బుకింగ్స్ కూడా మొదలైనట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి..ఇదే స్పీడ్ లో కలెక్షన్స్ రాబట్టితే మాత్రం వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా అని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు