kalki 2898AD Collections : ఏంట్రా అంత లేపారు.. ఇంత దారుణంగా పడిపోయాయి కలెక్షన్స్!

kalki 2898AD Collections : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రీసెంట్ గా నటించిన సినిమా కల్కి.. వీకెండ్ లో భారీగా కలెక్షనలను రాబట్టింది.. 5 రోజులకే రూ.625 కోట్లు రాబట్టడం మామూలు విషయం కాదు.. అయితే ఐదో రోజు నుంచి కాస్త తగ్గింది. ఆరో రోజు ఈ కలెక్షన్లు మరింత తగ్గాయి. అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా బడ్జెట్ ను మించిపోవడం విశేషం.. ఆరు రోజులకు గాను బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబాట్టిందో ఇప్పుడు చూద్దాం..

కల్కి ఆరు రోజుల్లోనే తన బడ్జెట్ రూ.600 కోట్లను గ్రాస్ దాటేసింది.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన ఈ మూవీ గత నెల 27 న రిలీజ్ కాగా.. తొలి రోజే రూ.191.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఆరో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.27.85 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు తెలిసిందే.. గత వారంలో వచ్చిన కలెక్షన్స్ ఈ వారంలో రాలేదని తెలుస్తుంది.. సోమవారం, మంగళవారం కలెక్షన్స్ కాస్త డౌన్ అయినట్లు ప్రస్తుతం వచ్చిన కలెక్షన్స్ ను చూస్తే అర్థమవుతుంది..

kalki 2898 ad six days boxoffice collections
kalki 2898 ad six days boxoffice collections

ఈ సినిమాకు ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.625 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకోవడం విశేషం. ఆరో రోజు కాస్త కలెక్షన్స్ తగ్గినట్లు తెలుస్తుంది.. ఆరో రోజుకు దాదాపు రూ. 60 కోట్లు రాబట్టింది.. ఇక తొలి రోజు నుంచే ఈ సినిమాకు ఎక్కడా నెగటివ్ టాక్ రాలేదు. సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పాజటివ్ రివ్యూలే ఇవ్వడంతో సినిమా పాజిటివ్ టాక్ తో దుమ్ము దులిపేస్తుంది.. హిందీ బెల్ట్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. నిజానికి నాలుగో రోజు నుంచి తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి.. ఈ వీకెండ్ కు కలెక్షన్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. 2000 కోట్ల రాబట్టే అవకాశం ఉందని టాక్…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు