Kalki 2898AD Collections : కల్కితో ఆరు సెంచరీలు.. రికార్డ్ బ్రేక్ చేసిన ప్రభాస్..

Kalki 2898AD Collections : కల్కి.. కల్కి.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మేనియా కొనసాగుతుంది.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. విడుదలైన మొదటి రోజు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఇప్పటివరకు భారీ కలెక్షన్స్ ను నమోదు చేసి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.. 5 రోజులకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలు అంటే మినిమమ్ ఆ రేంజ్ ఉంటుంది.. రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టింది.. నిన్నటి వరల్డ్ వైడ్ రూ.555 కోట్ల వరకు వసూల్ చేసింది.. ఈరోజు కలెక్షన్స్ ను చూస్తే మొత్తంగా రూ.625 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తుంది.. ఈ కలెక్షన్స్ పై మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇవే కలెక్షన్స్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అతి తక్కువ రోజుల్లోనే 800 కోట్లు అందుకొని రికార్డ్ ను బ్రేక్ చేసేలా కనిపిస్తుంది.. మొత్తంగా చూస్తే ఈ వీకెండ్ కు 1000 కోట్లు క్రాస్ చేస్తుందని తెలుస్తుంది..

kalki 5days world wide collections
kalki 5days world wide collections

ప్రముఖ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు ఇందులో నటించారు.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8500లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో ఈ సినిమా హడావిడి భారీ స్థాయిలో కనిపిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో సైతం ప్రభాస్ సినిమా షేక్ చేసేసింది. ఫలితంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.. మరోవైపు నార్త్ లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ ను అందుకుంటుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు