Kalki2898AD Collections : హమ్మయ్యా..! కింద మీద పడి… ఫైనల్‌గా ఆ రికార్డును అందుకుంది

Kalki2898AD Collections : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా కలెక్షన్ల జోరు ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్స్ తోనే యానానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో భారీ వసూళ్లు కొల్లగొడుతూ రోజుకో రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ విజువల్ వండర్ రేంజ్ లో తెరకెక్కించడంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన మొదటిరోజు నుండే వంద కోట్ల ఓపెనింగ్ తో కలెక్షన్ల జాతర స్టార్ట్ చేసిన కల్కి వీకెండ్ ముగిసే దాకా రోజుకు వంద కోట్లు కొల్లగొడుతూ రికార్డ్ సృష్టించాడు. బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత ఆ రేంజ్ లో థియేటర్లలో కలెక్షన్ల భీభత్సం సృష్టిస్తుంది కల్కి. తాజాగా కల్కి గురించి ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్న రికార్డు ఎట్టకేలకు ప్రభాస్ ఖాతాలో వచ్చి చేరింది.

Kalki2898AD finally reached the 1000 crore mark

కల్కి2898AD @1000 కోట్లు…

ప్రభాస్ నటించిన కల్కి సినిమా మొదలైనప్పుడే ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని అభిమానులతో సహా చిత్ర యూనిట్ సైతం తేల్చి చెప్పేసారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే కల్కి తొలిరోజు నుండే వెయ్యి కోట్లు లక్ష్యంగా భారీ ఓపెనింగ్స్ (Kalki2898AD Collections) తో జాతర స్టార్ట్ చేసింది. అయితే తొలి వారం ముగిశాక ఈ సినిమా కలెక్షన్లు డల్ అవుతున్నాయని, వెయ్యి కోట్ల మార్క్ దాటడం అసాధ్యమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కానీ వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ హోల్డ్ ని చూపిస్తూ, కల్కి సినిమా అదరగొడుతుంది. తాజాగా కల్కి2898AD సినిమా రెండు వారాలు పూర్తి చేసుకోగా నిన్నటికి 980 వరకు కలెక్షన్లు వచ్చాయని సమాచారం. ఇక ఈ రోజుతో కల్కి 1000 కోట్ల మార్క్ అందుకోబోతుంది. ఇక దీన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా, ఈ రోజు ఆఫీషియల్ గా పోస్టర్ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎట్టకేలకు కిందా మీదా పడి ఈ రికార్డు సాధించిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

త్వరలోనే జాపనీస్ రిలీజ్ కి రెడీ…

ఇక కల్కి సినిమా ఇండియాలో ఇప్పటికి స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతుండగా, కల్కి మేకర్స్ త్వరలోనే జాపనీస్ భాషలో, అలాగే కొరియన్, చైనీస్, స్పానిష్ భాషలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఏడాదిన్నర కింద రాజమౌళి RRR సినిమా జాపనీస్ ఓ విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ హైయెస్ట్ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచింది. ఇప్పుడు కల్కిని కూడా అదే రేంజ్ లో అక్కడ రిలీజ్ చేసి లాభాన్ని పొందాలని చూస్తున్నారు మేకర్స్. ఇక ఈ వారం పాన్ ఇండియా వైడ్ గా ఇండియన్2 విడుదలవుతున్న నేపథ్యంలో పోటీగా కల్కి ఎంత వరకు తట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు