Kalki2898AD : కొనసాగుతున్న కల్కి ప్రభంజనం.. 9 రోజుల్లో క్లీన్ హిట్

Kalki2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD మూవీ థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. రిలీజ్ అయిన మొదటిరోజు ప్రీమియర్స్ నుండే యానానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్న కల్కి థియేటర్ల వద్ద భారీ కలెక్షన్లతో దుమ్ములేపుతుంది. తొలిరోజు నుండే రికార్డులు క్రియేట్ చేయడం ప్రారంభించిన కల్కి బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ప్రభాస్ మూవీగా నిలిచింది. కల్కి విడుదలైన రోజే 190 కోట్ల భారీ ఓపెనింగ్స్ దక్కించుకోగా, వీకెండ్ ముగిసే వరకు కూడా రోజుకు వంద కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ట్రేడ్ విశ్లేషకులను విస్మయానికి గురి చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ అందుకున్న కల్కి వరల్డ్ వైడ్ గా 9 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ స్టేటస్ ని అందుకుంది.

Kalki2898AD movie crossed the 800 crore mark

కొనసాగుతున్న కల్కి రికార్డులు..

బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి ఒక్కో రోజు ఒక్కో రికార్డు క్రియేట్ చేస్తూ, ముందుకు సాగుతుండగా, ఇప్పటికే పలు చోట్ల RRR రికార్డులు కూడా బ్రేక్ అయిపోవడం విశేషం. ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే 14 మిలియన్ డాలర్ల మార్క్ దాటి బాహుబలి 2ని బ్రేక్ చేసే విధంగా దూసుకుపోతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అల్ టైం టాప్ 3 గ్రాసర్ గా నిలవగా, నైజాంలో బాహుబలి, సలార్ రికార్డులు బ్రేక్ చేసి టాప్ 2 గా నిలిచింది కల్కి. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ నైజాంలో అందనంత ఎత్తులో వంద కోట్ల వసూళ్లతో టాప్ లో ఉంది. దాన్ని బ్రేక్ చేయాలంటే లాంగ్ రన్ తప్పనిసరి. ఇక తాజాగా రెండో వీకెండ్ లో కల్కి అడుగుపెట్టగా, మేజర్ ఏరియాల్లో కల్కి హౌస్ ఫుల్ కలెక్షన్లతో దుములేపుతుంది.

- Advertisement -

కల్కి @800 కోట్లు…

ఇక తాజాగా మేకర్స్ కల్కి 800 కోట్ల వసూళ్లు సాధించిందని పోస్టర్స్ వేసారు. అయితే నిజానికి కల్కి ప్పటివరకు 720 కోట్ల మార్క్ ని అఫిషియల్ గా క్రాస్ చేసింది. ఇక 372 కోట్ల టార్గెట్ తో విడుదలైన కల్కి తొమ్మిది రోజుల్లో 374 కోట్ల షేర్ వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. పది లేదా పదకొండో రోజు వచ్చేసరికి ఎనిమిది వందల కోట్ల మార్క్ ని అందుకోవడం ఖాయమని తెలుస్తుంది. ఇక ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిన కల్కి ఇక లాభాల బాట పట్టింది. అయితే వెయ్యి కోట్ల వసూళ్లకు ఇంకా లాంగ్ రన్ కావాల్సి ఉంది. అయితే వచ్చే వారం ఇండియన్2 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కల్కి అప్పటివరకు ఎంత వసూలు చేస్తుందో చూడాలి. ఇక కల్కి2898AD పార్ట్ 2 వచ్చే ఏడాది సమ్మర్ లో రానున్నట్టుగా సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు