Kalki2898AD Collections : 1000 cr ఇంకా రాలేదా… ఇంకా పోస్టర్ రాకపోవడం వెనుక ఉన్న కథ ఏంటో…?

Kalki2898AD Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా కలెక్షన్ల హడావిడి ఇంకా కొనాగుతూనే ఉంది. రెండు వారాల కింద అనగా జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో భారీ వసూళ్లు కొల్లగొడుతూ దూసుకుపోయింది. అయితే రెండు వారాల తరవాత కల్కి కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ వారం సౌత్ లో ఇండియన్2, అలాగే హిందీలో సర్ఫిరా సినిమా రిలీజ్ కావడం వల్ల కల్కి సినిమాకి కాస్త బ్రేక్ వేశాయని చెప్పొచ్చు. అయితే లిమిటెడ్ కలెక్షన్లతో ఇప్పటికి మేజర్ ఏరియాల్లో జోరు చుపిస్తునే ఉంది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కగా, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ విజువల్ వండర్ గా తెరకెక్కించడంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్ లో బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత ఆ రేంజ్ లో థియేటర్లలో కలెక్షన్ల భీభత్సం సృష్టించిన సినిమాగా కల్కి నిలిచింది. అయితే కల్కి సినిమా మేకర్స్ ఆశించిన అరుదైన రికార్డ్ మాత్రం ఇంకా రాలేదని సమాచారం.

Kalki2898AD Movie latest Collections Update

1000 కోట్లు ఇంకా రాలేదా?

ఇకపోతే కల్కి2898AD (Kalki2898AD Collections) సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని, రిలీజ్ ముందు నుండి మేకర్స్ గాని, అభిమానులు గాని సోషల్ మీడియాలో బాగా ప్రమోషన్లు చేసారు. దానికి తగ్గట్టుగానే కల్కి ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ సాధించింది. కానీ కల్కి తొలివారం తరవాత బాక్స్ ఆఫీస్ వద్ద నెమ్మదించింది. వీకెండ్ లో పర్వాలేదని పించినా, వర్కింగ్ డేస్ లో ఎక్కువగా ప్రభావం చూపడం లేదని సమాచారం. ఇప్పటివరకు కల్కి కి వెయ్యి కోట్ల మార్క్ రాలేదన్నది వాస్తవం. ఇకపోతే కల్కి విడుదలైన పదిహేను రోజుల్లో వరల్డ్ వైడ్ గా 905.50 కోట్ల గ్రాస్ రాబట్టిందట. అంటే ఇంకా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాలంటే దాదాపు మరో వంద కోట్లు కావాలి అని సమాచారం.

- Advertisement -

పోస్టర్ రిలీజ్ చేయకపోవడానికి కారణం ఇదే!

ఇకపోతే కల్కి కలెక్షన్ల గురించి రెండు మూడు రోజులకోసారి పోస్టర్లు రిలీజ్ చేసిన మేకర్స్ నాలుగైదు రోజుల నుండి పోస్టర్లు రిలీజ్ చేయలేదు. చివరగా 900 కోట్ల మార్క్ అందుకుంది పోస్టర్లు వేసిన మేకర్స్ ఇంకా అభిమానులు ఎదురుచూస్తున్నా 1000 కోట్ల పోస్టర్ మాత్రం వేయలేదు. దీనికి కారణం కల్కి సినిమా ఇంకా వెయ్యి కోట్ల మార్క్ ని అందుకోకపోవడమే అని అంటున్నారు. అయితే ఈ వారం రిలీజ్ అయిన భారతీయుడు2, హిందీ లో సర్ఫిరా సినిమాలు ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు కాబట్టి, కల్కి2898AD మళ్ళీ పుంజుకుని అరుదైన వెయ్యి కోట్ల లాంఛనాన్ని పూర్తి చేస్తుందని అంటున్నారు నెటిజన్లు. మరి మూడో వీకెండ్ లో అయినా ఈ రికార్డు అందుకుంటుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు