Kalki2898AD : అరుదైన రికార్డుకు ఒక్క అడుగుదూరంలో ప్రభాస్.. ఇది సాధిస్తే చరిత్రే..

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా వరుస రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతుంది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా, అన్ని భాషల్లో కూడా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే కల్కి 1000 కోట్ల మార్క్ ని అందుకోగా, మరిన్ని అరుదైన రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఇక ప్రభాస్ సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తోడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రల వైవిధ్యం కూడా తోడు కావడంతో భారీ కలెక్షన్లు లభించాయి. ఇక కల్కి సినిమా ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ కావడమే కాకుండా వంద కోట్ల లాభాల దిశగా దూసుకుపోతుంది. ఇక రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో RRR, బాహుబలి 2 తర్వాత అత్యధిక లాభాలు అందుకున్న సినిమాగా కల్కి నిలిచింది. ఇక లేటెస్ట్ గా మరో అరుదైన రికార్డుకు కల్కి చేరువగా వచ్చేసింది.

Kalki2898AD will be number one if it collects 20 million dollars overseas

అడుగు దూరంలో కల్కి.. అందుకుంటే చరిత్రే..

ఇక ఆల్రెడీ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి, మరిన్ని రికార్డులు బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతున్న కల్కి లేటెస్ట్ గా మరో అరుదైన రికార్డుకు చేరువైంది. కల్కి సినిమాకి అన్ని ఏరియాల్లో కంటే ఎక్కువ భారీ ఓపెనింగ్స్ ఓవర్సీస్ లో వచ్చిన సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ తోనే అక్కడ RRR ఓపెనింగ్ డే రికార్డ్ బ్రేక్ చేసిన కల్కి, రోజుకో బడా సినిమా రికార్డుని బ్రేక్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా అరుదైన రికార్డుకు కల్కి చేరువలో ఉంది. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా బాహుబలి2. ఈ సినిమా ఓవర్సీస్ 20.5 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, ఆ తర్వాత 14 మిలియన్ డాలర్లతో RRR రెండో స్థానంలో నిలిచింది. ఇక మొదటివారంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు అన్నింటిని బ్రేక్ చేసిన కల్కి 12 రోజుల్లో ఆర్ఆర్ఆర్ ని కూడా బ్రేక్ చేసింది. ఇక లేటెస్ట్ గా 18 మిలియన్ డాలర్ల మార్క్ ని అందుకున్న కల్కి ఓవర్సీస్ లో బాహుబలి2 ని బ్రేక్ చేసేందుకు ఒక్క అడుగుదూరంలో ఉంది. మరో వారం రోజులు స్టడీ కలెక్షన్లు వసూలు చేస్తే బాహుబలి ని బ్రేక్ చేసి ఓవర్సీస్ లో అల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడానికి రెడీ అవుతుంది. ఈ రికార్డు సాధిస్తే అది చరిత్రే అని చెప్పొచ్చు.

- Advertisement -

హిందీలోనూ లాంగ్ రన్…

ఇక కల్కి సినిమా హిందీలో కూడా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే 230 కోట్ల మేకర్ దాటేసిన ఈ సినిమా త్వరలో RRR వసూళ్ళని బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ లో 276 కోట్ల వసూళ్లు సాధించగా, లాంగ్ రన్ లో కల్కి బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. పైగా రీసెంట్ గా విడుదలైన భారతీయుడు2 కూడా మెప్పించకపోవడంతో తిరిగి ఆడియన్స్ కల్కి వైపు మొగ్గుచూపుతున్నారు. మరి కల్కి మరో వంద కోట్లు వెనకేసుకుంటుందా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు