Love Me : వర్కింగ్ డే తో తేలిపోయింది.. ఇక డిజాస్టర్ కిందే లెక్క.. !

Love Me : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో రెండు తెలుగు సినిమాలు కాస్త బెటర్ అంచనాలతో రిలీజ్ కాగా, ఆ రెండు కూడా ప్రేక్షకుల దగ్గర మిక్సడ్ టాక్ తెచ్చుకోగా, అందులో ఒకటి “లవ్ మీ” సినిమా. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రాగా, లవ్ మీ (Love Me) సినిమా లో దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇక ఈ సినిమా నిజం చెప్పాలంటే మిశ్రమ స్పందన లా కూడా కాకుండా ఆల్మోస్ట్ నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుందనే చెప్పాలి. ఇక ఐపీఎల్ సీజన్ అయిపోవడంతో ఈ సినిమాకు మొదటి రెండు రోజుల షార్ట్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని, మూడో రోజు వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా డే 2 తో పోల్చితే డే 3 రోజున సినిమా ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.

Love Me movie 3 days collections

మూడు రోజుల్లో వచ్చింది ఇంతే..

ఇక లవ్ మీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రెండు రోజులు పర్వాలేదనిపించినా మూడో రోజు చాలా డ్రాప్ అయింది. మొత్తం మీద మూడవ రోజు 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మరో 5 లక్షల దాకా ఎక్కువగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా మొత్తం మీద 3వ రోజున 20 లక్షల రేంజ్ లో షేర్ ని అయితే సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు..
3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాంలో 74 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ లో 84 లక్షలు, రాబట్టగా, కర్ణాటక, ఇంకా ఓవర్సీస్ సహా అన్ని చోట్ల కలిపి కేవలాం మరో 27 లక్షలు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా లవ్ మీ 1.85 కోట్ల షేర్ ని 4.10 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.

- Advertisement -

వర్కింగ్ డే తో డిజాస్టర్ గా తేలిపోయింది..

ఇక లవ్ మీ (Love Me) సినిమా మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్ల దాకా ఉండగా సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ డే లో పట్టుమని పాతిక లక్షలు కూడా సరిగా రాబట్టలేకపోయింది. పైగా ఈ వారం ప్రతిష్టాత్మకంగా మూడు మినిమం అంచనాలున్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, ఈ వారం లవ్ మీ ని థియేటర్లలోంచి దాదాపు గా తీసే అవకాశం ఉంది. ఇక మిగిలిన రోజుల్లో మహా అయితే మరో కోటి వరకు రావచ్చని అంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా యాభై శాతం నష్టాలు తప్పవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక లవ్ మీ సినిమా కి లాభాలు రాకున్నా తక్కువ నష్టాలు రావడానికి ఏదైనా నిర్మాత దిల్ రాజు ఏం చేస్తాడో చూడాలి. ఇక లవ్ మీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును పూర్తి చేస్తుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు