Maharaja : కెరీర్ బెస్ట్ కొట్టిన మక్కల్ సెల్వన్.. డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా…

Maharaja : కోలివుడ్ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ ఇండియా అంతటా మంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ సేతుపతి. హీరోగానే కాకుండా, విలన్ గానూ మెప్పిస్తూ, ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ఆక్టర్ లలో ఒకరిగా దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమా “మహారాజా” గత వారం థియేటర్లలో క్రేజీ అంచనాల మధ్య విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా మౌత్ టాక్ తో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు ఫిదా అయి అన్ని చోట్ల కలెక్షన్లతో బ్రహ్మరథం పట్టరాని చెప్పాలి. ఇక మహారాజ సినిమా రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా, విడుదల తర్వాత మంచి పాజిటివ్ రివ్యూలు సొంతం అవ్వగా, ప్రేక్షకుల నుండి మౌత్ టాక్ తెచ్చుకుని దుమ్ములేపుతుంది. ఇక కలెక్షన్స్ పరంగా మొదటి రోజు నుండే దుమ్ములేపుతున్న ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించగా, ఇప్పుడు పది రోజులు పూర్తయ్యే సరికి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా, భారీ ప్రాఫిట్స్ వెనకేసుకుంది.

Maharaja Movie 10 Days Collections

పది రోజుల్లో మమ్మోత్ కలెక్షన్స్…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ సేతుపతి మహారాజ (Maharaja) సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. మొదటి వారం బ్లాక్ బస్టర్ వసూళ్లనందుకున్న ఈ సినిమా రెండో వారంలో కూడా జోరు చూపెడుతూ అన్ని చోట్ల దూసుకుపోతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పదవ రోజు కూడా జోరు చూపించిన మహారాజ 58 లక్షలకి పైగా షేర్ వసూలు చేసింది. ఇక పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 5.43కోట్ల షేర్ 10.95 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 3.50 కోట్ల టార్గెట్ కి ఆల్ మోస్ట్ 2 కోట్ల వరకూ ప్రాఫిట్ అందుకుని బ్లాక్ బస్టర్ అయింది. ఇక తమిళ్ లో కూడా భారీ కలెక్షన్లు రాబట్టిన మహారాజా సినిమా పది రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ల లెక్కలను గమనిస్తే.. తమిళ నాడు 39.60 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 10.95 కోట్లు, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 10.25 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్ లో 20.40 కోట్లు వసూలు చేసింది. టోటల్ గా పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా మహరాజా మూవీ 81.20 కోట్ల గ్రాస్, 39.25 కోట్ల షేర్ వసూలు చేసింది.

- Advertisement -

100 కోట్ల బ్లాక్ బస్టర్ దిశగా…

ఇక మహారాజ సినిమా అన్ని చోట్ల ఇప్పటికి స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతుండగా, 81 కోట్ల వసూళ్లు సాధించి విజయ్ సేతుపతి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలవగా, ఈ సినిమా బిజినెస్ కి ఆల్మోస్ట్ రెట్టింపు వసూలు చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మహారాజ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్లు వసూలు చేస్తుండగా, 100 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇక మరో నాలుగు రోజుల్లో కల్కి సినిమా వచ్చేవరకు ఏ సినిమా లేదు, కాబట్టి ఈ లోపు వంద కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఇక కల్కి వచ్చినా అక్కడక్కడా లిమిటెడ్ స్క్రీన్స్ లో మహారాజని ప్రదర్శించే చాన్సు ఉంది.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు