Maharaja : నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్.. మక్కల్ సెల్వన్ మాస్ కం బ్యాక్!

Maharaja : కోలివుడ్ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి పేరున్న హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతి త్వరలో తన కెరీర్ లో 50వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ “మహారాజా” (Maharaja) ఈ వారం థియేటర్లలో క్రేజీ అంచనాల మధ్య విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 300 కి పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మౌత్ టాక్ తో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పాలి. అయితే మహారాజకి రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా, విడుదల తర్వాత మంచి పాజిటివ్ రివ్యూలు సొంతం అవ్వగా, ప్రేక్షకుల నుండి మౌత్ టాక్ తెచ్చుకుని దుమ్ములేపుతుంది. ఇక కలెక్షన్స్ పరంగా మొదటి రోజు నుండే దుమ్ములేపుతున్న ఈ సినిమా అనూహ్యంగా రోజురోజుకి గ్రోత్ చూపించి మంచి కలెక్షన్లను సాధించింది. ఇక వీకెండ్ మొత్తం అదరగొట్టిన ఈ సినిమా నాలుగో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్లను సాధించింది.

Maharaja movie 4 days collections

నాలుగురోజుల్లో బ్రేక్ ఈవెన్…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ సేతుపతి తన అద్భుత నటనతో పాటు, మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుండగా, మహారాజ(Maharaja) ఎక్స్ లెంట్ రివ్యూలు, కలెక్షన్స్ తో దూసుకుపోతూ ఉండగా సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా వీకెండ్ లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, సినిమా 4వ రోజు బక్రీద్ పండగ అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా బాగా హోల్డ్ ని చూపించింది. ఇక తెలుగు లో కొన్ని చోట్ల డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా, ఆల్ మోస్ట్ మొదటి రోజుకి దగ్గరయ్యే రేంజ్ లో వసూళ్ళని అందుకోవడం విశేషం. ఇక మొత్తం మీద 4వ రోజున 51 లక్షల షేర్ ని అందుకున్న ఈ సినిమా, ఓవరాల్ గా 4 రోజుల్లో ఇప్పుడు టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాం లో 1.62 కోట్లు, సీడెడ్ 56 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ 1.28 కోట్లు రాబట్టగా, టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 3.46 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక 3.5 కోట్ల టార్గెట్ ను ఆల్ మోస్ట్ అందుకున్న సినిమా, తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని లాభాలలోకి ఎంటర్ కాబోతుంది.

- Advertisement -

మక్కల్ సెల్వన్ మాస్ కం బ్యాక్…

ఇక టోటల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
తమిళ నాడు 21.30 కోట్లు
తెలుగు స్టేట్స్ 6.95 కోట్లు
కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా 5.10కోట్లు
ఓవర్సీస్ లో 7.05 కోట్లు
మొత్తంగా చూసుకుంటే మహారాజ సినిమా వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 40.40 కోట్ల గ్రాస్ 19.85 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ టార్గెట్ రేంజ్ 21 కోట్ల దాకా ఉండగా సినిమా 4వ రోజు సాలిడ్ హోల్డ్ ని చూపించగా 5వ రోజు కలెక్షన్స్ తో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని కూడా అందుకునే అవకాశం ఉండగా, లాంగ్ రన్ లో సాలిడ్ గా లాభాలని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక గత కొంత కాలంగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న విజయ్ సేతుపతి కి మాస్ కం బ్యాక్ హిట్ దక్కిందని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు