Manamey : మనమే ఫస్ట్ డే లెక్క.. అనుకున్నదానికన్నా బానే వచ్చాయి…

Manamey : టాలీవుడ్ లో ఈ వారం మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయన్న సంగతి తెల్సిందే. అయితే ఆ సినిమాల్లో కాస్త బెటర్ హైప్ ఉన్న సినిమా “మనమే”. టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం (జూన్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ వచ్చి కూడా దాదాపు రెండేళ్లు దాటింది. కాస్త గ్యాప్ తీసుకున్న శర్వా నటించిన లేటెస్ట్ మూవీ అయిన మనమే (Manamey) మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా, సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే లెవల్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా తొలిరోజు కలెక్షన్స్ పరంగా మంచి జోరునే సినిమా చూపించిందని చెప్పాలి. ఇక శర్వానంద్ ప్రీవియస్ మూవీ అయిన ఒకే ఒక జీవితం కన్నా కూడా ఈ సినిమా బెటర్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద అనుకున్న అంచనాలను కొద్ది వరకు మించిపోయింది.

Manamey movie 1st day collections

డీసెంట్ ఓపెనింగ్స్ ఇచ్చుకున్న మనమే…

ఇక శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమా మొదటి రోజు 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని భావించగా, ఈ సినిమా అనుకున్నట్లే మొదటి రోజు ఆల్ మోస్ట్ 56 వేల దాకా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ములేపింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 1.4 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని డీసెంట్ జోరుని చూపించింది. ఇక మనమే సినిమా వరల్డ్ వైడ్ గా 1.8 కోట్లకు పైగా షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవడం విశేషమని చెప్పాలి. ఇక మొదటి రోజు ఈ సినిమా ఏరియా వైస్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాం లో 70 లక్షలు, సీడెడ్ లో 15 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ లో 58 లక్షలు వసూలు చేయగా, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 15 లక్షలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో 25 లక్షలు రాబట్టింది. ఇక మొత్తం మీద మనమే సినిమా వరల్డ్ వైడ్ గా 1.83 కోట్ల షేర్ ని 3.50 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

- Advertisement -

వీకెండ్ లో జోరు పెంచాలి..

ఇక మొత్తం మీద మనమే సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 10 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని టీం చెబుతూ ఉండగా, సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 8.17 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనితో పాటు రిలీజ్ అయిన మిగతా సినిమాలకు కూడా పెద్దగా పాజిటివ్ టాక్ రాకపోవడం మనమే కి ప్లస్ పాయింట్ అయింది. అయితే ఈ వీకెండ్ లో మాత్రం మంచి గ్రోత్ చూపించాల్సి ఉంటుంది. ఇక మనమే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక మనమే సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు