Manamey : మనమే రెండో రోజు లెక్క.. ఉహించని గ్రోత్ ఇది!

Manamey : టాలీవుడ్ లో ఈ వారం మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయన్న సంగతి తెల్సిందే. అయితే ఆ సినిమాల్లో కాస్త బెటర్ హైప్ ఉన్న సినిమా “మనమే”. టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం (జూన్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ వచ్చి కూడా దాదాపు రెండేళ్లు దాటింది. కాస్త గ్యాప్ తీసుకున్న శర్వా నటించిన లేటెస్ట్ మూవీ అయిన మనమే (Manamey) మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా, సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే లెవల్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా తొలిరోజు కలెక్షన్స్ పరంగా మంచి జోరునే సినిమా చూపించిందని చెప్పాలి. ఇక శర్వానంద్ ప్రీవియస్ మూవీ అయిన ఒకే ఒక జీవితం కన్నా కూడా ఈ సినిమా బెటర్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా అనుకున్న అంచనాలను మించిపోయి మంచి గ్రోత్ చూపించింది.

Manamey movie 2days collections

మనమే 2డేస్ కలెక్షన్స్..

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ మనమే మూవీ రెండో రోజు కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఆల్మోస్ట్ డే 1 రేంజ్ ని మించి హోల్డ్ ని కొనసాగించగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా మంచి గ్రోత్ నే కొనసాగించి ఓవరాల్ గా మొదటి రోజుకి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. మొదటి రోజు మనమే 1.43 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా, రెండో రోజుకి వచ్చే సరికి ఆల్ మోస్ట్ 20% కి పైగా గ్రోత్ ని చూపించి 1.72 కోట్ల రేంజ్ లో షేర్ ని, 3.20 కోట్లకు పైగా గ్రాస్ ను దక్కించుకుని అనుకున్న కలెక్షన్స్ కన్నా కూడా ఎక్కువ వసూళ్ళని అందుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 2.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 3.80 కోట్ల దాకా ఉండటం విశేషం కాగా మొత్తం మీద ఇప్పుడు సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన 3.85 కోట్ల షేర్ ని, 7.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.

- Advertisement -

అన్ని కుదిరితే వారంలో బ్రేక్ ఈవెన్..

ఇక మొత్తం మీద మనమే సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 10 కోట్లకు పైగా ఉండగా, మొదటి 2 రోజుల్లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని అందుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 6.15 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ని చూపించే అవకాశం ఉండటంతో సగానికి పైగా టార్గెట్ ను రికవరీ ఛాన్స్ అవకాశం ఎంతైనా ఉంది. ఇక అన్నీ కుదిరి వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపిస్తే, మనమే సినిమా వారం ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మనమే సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, హేశం అబ్దుల్లా మ్యూజిక్ అందించారు. మరి వీకెండ్ ముగిసేలోగా మనమే ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు