Manamey : ఎట్టకేలకు క్లీన్ హిట్టు కొట్టేసింది.. ఎంత లాభం వచ్చిందంటే?

Manamey : టాలీవుడ్ లో రెండు వారాల కింద మంచి క్రేజీ అంచనాలతో విడుదలైంది “మనమే” సినిమా. శర్వానంద్ హీరోగా రెండేళ్ల గ్యాప్ తర్వాత నటించిన సినిమా ఇది. అయితే రీసెంట్ గా సమ్మర్ నుండి చూసుకుంటే అసలు తెలుగులో మంచి హిట్ ఒక్కటీ పడలేదు. కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపిస్తూ బిజినెస్ లను రికవరీ చేసినా, కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి క్లీన్ హిట్స్ జాబితాలోకి మాత్రం ఎంటర్ అవ్వలేక పోయాయి. హిట్టైన సినిమాలన్నీ డబ్బింగ్ సినిమాలే. భజే వాయువేగం లాంటి సినిమాలు తక్కువ బిజినెస్ చేసి బిజినెస్ రికవరీ చేసాయే తప్ప, అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయి, క్లీన్ హిట్ కాలేకపోయాయి. ఇలాంటి టైంలో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ “మనమే” (Manamey) మొదటి రోజు మిక్సుడ్ టాక్ తోనే ఓపెన్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనూహ్యంగా స్టడీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ లాంగ్ రన్ ను దక్కించకుంది. ఇక రెండు వారాల్లో బిజినెస్ ను దాటేసి బ్రేక్ ఈవెన్ కి దగ్గర అవ్వగా, 15 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి మంచి విజయాన్ని అందుకుంది.

Manamey movie break even done in 15 days

క్లీన్ హిట్ కొట్టేసిన మనమే..

ఇక మనమే సినిమా విడుదలైన 14వ రోజున 11 లక్షల షేర్ ని అందుకోగా, 15వ రోజున ఒక లక్ష డ్రాప్ అయ్యి 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా, వరల్డ్ వైడ్ గా 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 15 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… నైజాం – 3.62 కోట్లు, సీడెడ్ 88 లక్షలు, ఆంధ్ర, 3.81 కోట్లు వసూలు చేయగా, కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 60 లక్షలు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో 1.12 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 15 రోజుల్లో 10.03 కోట్ల షేర్, 19.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మొత్తం మీద 10 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన మనమే సినిమా 15 రోజుల్లో ఆ టార్గెట్ ను దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది.

- Advertisement -

కల్కి వచ్చే వరకూ రన్ ఉంటుందా?

ఇక మనమే సినిమా రిలీజ్ అయి రెండు వారాలైనా ఇప్పటికీ అక్కడక్కడా మల్టీప్లెక్స్ లలో మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు ఒక్కటి కూడా మంచి టాక్ తెచ్చుకోలేదు, గత వారం రిలీజ్ అయిన సినిమాలు కూడా ఓ మోస్తరుగా ఆడుతున్నాయి కాబట్టి, ఇక కల్కి వచ్చే వరకు సినిమా రన్ లిమిటెడ్ కలెక్షన్స్ తో మనమే కొనసాగే అవకాశం ఉండగా, మిగిలిన రన్ లో వచ్చేవన్నీ కూడా బోనస్ అనే చెప్పాలి. ఇక మనమే శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా, ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో టిజి విశ్వా ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, హేశం అబ్దుల్లా మ్యూజిక్ అందించాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు