Manamey Collections : మనమే ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఇంకా ఎంత కావాలంటే?

Manamey Collections : టాలీవుడ్ లో గత వారం రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో శర్వానంద్ నటించిన “మనమే” సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా అన్నికంటే మంచి అంచనాలతో రిలీజ్ కాగా, మిగతా సినిమాలతో పోల్చితే బెటర్ గా డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి వీకెండ్ లో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, మనమే (Manamey) వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హోల్డ్ ని చూపిస్తూ వచ్చింది. వర్కింగ్ డేస్ లో సినిమా 4వ రోజు కొంచం డ్రాప్ అయినా కూడా తిరిగి 5వ రోజు నుండి మంచి హోల్డ్ ని చూపెడుతూ పరుగును కొనసాగించింది. దాంతో మొదటి వారంలో ఓవరాల్ గా సినిమా మంచి కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగించి బిజినెస్ లో ఆల్ మోస్ట్ 74% వరకు రికవరీని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజున 36 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. 7వ రోజున వర్కింగ్ డే లో కూడా సినిమా మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 34 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 39 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

Manamey movie first week collections

మనమే ఫస్ట్ వీక్ లెక్క…

ఇక మొదటి వారం పూర్తి అయ్యే టైంకి మనమే సినిమా సాధించిన వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాం లో 2.57 కోట్లు , సీడెడ్ 63 లక్షలు , ఆంధ్ర 2.76 కోట్లు వసూలు చేయగా, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 50 లక్షలు, ఓవర్సీస్ లో 95 లక్షలు వసూలు చేసింది. ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గా మనమే సినిమా మొదటివారం 7.41 కోట్ల షేర్, 14.40 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. మొత్తం మీద సినిమా 10 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.59 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా రెండో వారంలో హోల్డ్ ని చూపిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కి అవకాశం అయితే ఉందని చెప్పాలి.

- Advertisement -

రెండో వారం హోల్డ్ చూపిస్తుందా?

ఇక మనమే సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా వారం రోజులలో వచ్చిన కలెక్షన్స్ కాకుండా, 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఆల్మోస్ట్ 74 శాతం రికవరీని దక్కించుకోగా క్లీన్ హిట్ కోసం సినిమా ఇంకా 2.59 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మరి రెండో వారంలో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి. ఇక మనమే లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, శ్రీ రామ్ ఆదిత్య డైరెక్ట్ చేసాడు. హేశం అబ్దుల్లా మ్యూజిక్ అందించాడు. ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వారు నిర్మించారు. ఇక శర్వానంద్ రెండేళ్ల కింద ఒకే ఒక జీవితం సినిమాతో డీసెంట్ క్లాస్ హిట్ కొట్టగా, ఇప్పుడు గ్యాప్ తీసుకుని మనమే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా థియేటర్ల వద్ద క్లాస్ సెంటర్లో బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నా, మాస్ సెంటర్లలో ఇంకా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయాల్సి ఉంది. ఈ వారం రిలీజ్ అయిన హరోంహర సినిమా మంచి టాక్ తెచ్చుకోగా మనమే సినిమాకి వసూళ్ళలో దెబ్బ పడే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు