Manamey : మనమే వీకెండ్ కలెక్షన్స్.. మ్యాచ్ ఎఫెక్ట్ పడ్డా బానే వచ్చాయి..!

Manamey : టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ సినిమా ఈ శుక్రవారం (జూన్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు శర్వానంద్ ఒక క్లాస్ సినిమాతో వచ్చాడు. ఇక థియేటర్లలో మనమే (Manamey) మూవీకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ సొంతం అవ్వగా తొలిరోజు కలెక్షన్స్ పరంగా మంచి జోరునే సినిమా చూపించిందని చెప్పాలి. శర్వానంద్ ప్రీవియస్ మూవీ అయిన ఒకే ఒక జీవితం కన్నా కూడా ఈ సినిమా బెటర్ ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా అనుకున్న అంచనాలను మించిపోయి మంచి గ్రోత్ చూపించింది. ఇప్పుడు మూడో రోజు కూడా పర్వాలేదనిపించే వసూళ్లు తెచ్చుకుంది. ఓవరాల్ గా మొదటి వీకెండ్ లో మనమే మంచి కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకుంది.

Manamey movie weekend collections

డీసెంట్ మ్యాచ్ ఎఫెక్ట్ పడ్డా బానే వచ్చాయిగా..

ఇక మనమే సినిమా మొదటి రెండు రోజులకి తగ్గట్టుగానే మూడో రోజు కూడా మంచి జోరునే చూపించినా, ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఇంపాక్ట్ చూపగా, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు డ్రాప్స్ సొంతం అయ్యి మూడో రోజు 46 వేల దాకా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మూడో రోజు 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా, ఓవరాల్ గా 1.22 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా, వరల్డ్ వైడ్ గా సినిమా 1.52 కోట్ల షేర్ ని 3.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా 3 రోజుల వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాంలో 1.92 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో 2.01 కోట్ల షేర్, సీడెడ్ లో 45 లక్షల షేర్ వసూలు చేయగా, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా లో 35 లక్షల షేర్, ఓవర్సీస్ లో 64 లక్షల షేర్ రాబట్టింది.

- Advertisement -

వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తుందా?

ఇక మనమే సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా వీకెండ్ లో 5.37 కోట్ల షేర్, 10.35 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సగం రికవరీని దక్కించుకోగా క్లీన్ హిట్ కోసం సినిమా ఇంకా 4.63 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వర్కింగ్ డేస్ లో కూడా సినిమా మంచి హోల్డ్ ని చూపిస్తే బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. ఇక మనమే లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, శ్రీ రామ్ ఆదిత్య డైరెక్ట్ చేసాడు. హేశం అబ్దుల్లా మ్యూజిక్ అందించాడు. ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నిర్మించారు. ఇక మనమే వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు