Manamey : బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురీదుతున్న శర్వా మూవీ.. ఇంకా ఎంత రావాలంటే?

Manamey : టాలీవుడ్ లో గత వారం రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో శర్వానంద్ నటించిన “మనమే” సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా అన్నికంటే మంచి అంచనాలతో రిలీజ్ కాగా, మిగతా సినిమాలతో పోల్చితే బెటర్ గా డీసెంట్ టాక్ న సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి వీకెండ్ లో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, మనమే (Manamey) తాజాగా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, కానీ తిరిగి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపించి తక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇక మనమే 4వ రోజున సినిమా 48 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 5వ రోజుకి వచ్చే సరికి సినిమా 8 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి 40 లక్షల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం విశేషం. ఇక వరల్డ్ వైడ్ గా మనమే సినిమా ఓవర్సీస్ లో హోల్డ్ ని చూపించడంతో 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ 1.10 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది మనమే మూవీ.

Manamy movie 5 days collections

వర్కింగ్ డేస్ లో డీసెంట్ హోల్డ్…

ఇక మనమే సినిమా వర్కింగ్ డేస్ లో డీసెంట్ హోల్డ్ ని చూపిస్తుండగా, 5 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే.. నైజాం 2.26 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ 2.44 కోట్లు, సీడెడ్ 56 లక్షలు రాబట్టగా, తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 5.26 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 45 లక్షలు వసూలు చేయగా, ఓవర్సీస్ లో 85 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా మనమే సినిమా ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 6.56 కోట్ల షేర్ 12.70కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

- Advertisement -

ఎదురీదుతున్న మనమే..

ఇక మనమే సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఐదు రోజులలో వచ్చిన కలెక్షన్స్ కాకుండా, 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఆల్మోస్ట్ 70 శాతం రికవరీని దక్కించుకోగా క్లీన్ హిట్ కోసం సినిమా ఇంకా 3.44 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వర్కింగ్ డేస్ లో కూడా సినిమా మంచి హోల్డ్ ని చూపిస్తే బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి. ఇక మనమే లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, శ్రీ రామ్ ఆదిత్య డైరెక్ట్ చేసాడు. హేశం అబ్దుల్లా మ్యూజిక్ అందించాడు. ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వారు నిర్మించారు. ఇక శర్వానంద్ రెండేళ్ల కింద ఒకే ఒక జీవితం సినిమాతో డీసెంట్ క్లాస్ హిట్ కొట్టగా, ఇప్పుడు గ్యాప్ తీసుకుని మనమే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా థియేటర్ల వద్ద క్లాస్ సెంటర్లో బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నా, మాస్ సెంటర్లలో ఇంకా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయాల్సి ఉంది. మరి మొదటి వారం పూర్తయ్యే సరికి మనమే సినిమా ఎలాంటి కలెక్షన్లు వసూలు చేస్తుందో, ఎంత వరకు బ్రేక్ ఈవెన్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు