Mass4k Collections : షాకిచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇలా జరిగిందేంటి!

Mass4k Collections : టాలీవుడ్ లో కొన్నాళ్లుగా రీ రిలీజ్ ప్రభావం తగ్గిపోగా, రీసెంట్ గా మహేష్ బాబు మురారి తో మళ్ళీ ఊపందుకుంది. ఆ సినిమా రీ రిలీజ్ రికార్డులని తిరగరాసింది. ఇక దాని తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఇంద్ర” (Indra) సినిమా కూడా రీ రిలీజ్ అయింది. ఈ సినిమా రీ రిలీజ్ చేయాలనీ చిరు ఫ్యాన్స్ ఎప్పట్నుంచో కోరుకుంటుండగా, చిరు బర్త్ డే స్పెషల్ గా థియేటర్లలో రీ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్ తో సీనియర్ స్టార్ హీరోల పరంగా అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేసింది. ఇక తాజాగా కింగ్ నాగార్జున (Nagarjuna) నటించిన “మాస్” సినిమా థియేటర్లలో మార్చి 28న విడుదలైంది. నాగార్జున బర్త్ డే సందర్బంగా రిలీజ్ అయిన మాస్ సినిమాకి థియేటర్లలో ప్రధాన నగరాల్లో హంగామా చేసారు ఫ్యాన్స్.

Mass Movie ReRelease Collections

షాకిచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్…

అయితే నాగార్జున బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ అయిన మాస్ సినిమా (Mass4k Collections) థియేటర్లలో భారీ వసూళ్లు అందుకుంటుందని అనుకున్నారు. తీరా మొదటి రోజు కలెక్షన్లు చూస్తే ఫ్యాన్స్ కి గట్టి షాకిచ్చాయని చెప్పాలి. మాస్ సినిమాపై ముందు నుండి, ఆశించినంత డిమాండ్ లేకపోయినా, ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని ఆశించారు. కానీ బాగా పేరున్న కొన్ని థియేటర్లలో తప్ప అన్ని చోట్ల సినిమా తేలిపోయింది. ఇక ఫస్ట్ డే వసూళ్ళని గమనిస్తే.. మొత్తం మీద నైజాంలో 6 లక్షల రేంజ్ లో, తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షల రేంజ్ లో బుకింగ్స్ నమోదు అవ్వగా, టోటల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 18 లక్షల రేంజ్ లో గ్రాస్ ను, టోటల్ ఇండియాలో 22 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

- Advertisement -

మన్మథుడు కంటే తక్కువ..

ఇక మాస్ (Mass4k) సినిమా లిమిటెడ్ స్క్రీన్స్ లోనే రిలీజ్ అవగా, రీ రిలీజ్ లో ఏమాత్రం ఆశించినంత రెస్పాన్స్ తెచ్చుకోలేదని చెప్పాలి. నాగార్జున గత సినిమా మన్మథుడు కూడా 80 లక్షల వరకు వసూళ్లు అందుకుంది. కానీ మాస్ సినిమా అందులో సగం కూడా రాబట్టక పోవడం షాకింగ్ అని చెప్పాలి. ఇక లిమిటెడ్ స్క్రీన్స్ లోనే రిలీజ్ అయిన మాస్ కు బర్త్ డే రోజు డీసెంట్ బుకింగ్స్ నమోదు కాగా, మరో పది లక్షల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు