Mr Bachchan Collections : ఇది ఎవ్వరూ ఊహించలేనిది… రవితేజ సినిమాకు దారుణమైన ఓపెనింగ్స్..

Mr Bachchan Collections : టాలీవుడ్ లో ఆగష్టు 15న రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో ‘మిస్టర్ బచ్చన్’ కూడా ఒకటి. మాస్ మహారాజ్ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండేవి. వీళ్ళ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కగా, ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ కూడా మెప్పించడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే అలా థియేటర్లకు వెళ్లిన అభిమానులకు హరీష్ శంకర్, రవితేజ దారుణంగా దెబ్బసారు. తాజాగా మిస్టర్ బచ్చన్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. అయితే టాక్ ఎలా ఉన్నా మిస్టర్ బచ్చన్ పై ఉన్న హైప్ కి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇలా జరుగుతుందని ఊహించనే లేదు.

Mr Bachchan first day Collections

దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకున్న మిస్టర్ బచ్చన్..

మిస్టర్ బచ్చన్ సినిమా నిజానికి రీమేక్ అని తెలిసినప్పుడు అంతగా హైప్ లేకపోయినా, హరీష్ (Harish shankar) తన ప్రొమోషన్లతో నమ్మకం కలిగించాడు. కానీ థియేటర్లలో మాత్రం విసుగు పుట్టించారని చెప్పాలి. అయితే కాంబో హైప్ వల్ల టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఫస్ట్ డే ఇంత దారుణమైన ఓపెనింగ్స్ వస్తాయని ఫ్యాన్స్ కూడా ఊహించలేదు. మిస్టర్ బచ్చన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే.. తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్స్ తో కలిపి మొత్తం 5.25 కోట్ల షేర్ ఉంటుందట. పైగా అందులో నైజాం నుండ 2.8 కోట్ల షేర్ రాబట్టగా, ఇందులో కూడా కోటికిపైగా ప్రీమియర్స్ కలెక్షన్సే ఉన్నాయి. ఓవరాల్ గా వరల్డ్ ఇదే గా ప్రీమియర్స్ తో కలిపి 5.26 కోట్ల షేర్ ని రాబట్టినట్టు తెలుస్తుంది.

- Advertisement -

టార్గెట్ లో సగమైనా వస్తుందా?

ఇక మిస్టర్ బచ్చన్ కి 31 కోట్ల బిజినెస్ జరగగా అందులో ఒక్క నైజాం ఏరియాలోని 11 కోట్ల వరకు రాబట్టాలి. ఓపెనింగ్స్ ని బట్టి చూస్తే, అసలు బిజినెస్ లో సగమైనా వస్తాయా లేదా అన్న డౌట్ వస్తుంది. పైగా రెండో రోజు బుకింగ్స్ కూడా దారుణంగా ఉన్నాయి. వీకెండ్ లో మహా అయితే పది కోట్లు రావొచ్చని అంటున్నారు. ఇక రొటీన్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు హరీష్ శంకర్ విసుగు తెప్పించగా, రవితేజ (Raviteja) కూడా కొత్తదనం లేని యాక్టింగ్ తో ఒకింత నిరాశపరిచాడని టాక్. హరీష్ శంకర్ మార్క్ ఈ సారి ఇంతలా దెబ్బ కొడుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. మరి వీకెండ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు