Munjya : బాలీవుడ్ స్టార్స్ కే సవాల్ విసురుతున్న చిన్న సినిమా… కోట్లు గుమ్మరిస్తున్న హారర్ మూవీ..!

Munjya : బాలీవుడ్ లో ఈ మధ్య వస్తున్న సినిమాలు ఆడియన్స్ ని ఏమాత్రం మెప్పించలేకపోతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలు అసలే రావడం లేదు. పైగా పెద్ద పెద్ద స్టార్లు కూడా నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఎన్నో భారీ అంచనాలతో వచ్చి భారీ నష్టాలని తెచ్చిపెట్టాయి. నిజం చెప్పాలంటే ఈ ఏడాది ఒక్క బాలీవుడ్ స్టార్ హీరో నటించిన సినిమా కూడా ఇంకా సక్సెస్ కాలేదు. హిట్ల విషయానికి వస్తే వేళ్ళ మీద లెక్క పెట్టినా తక్కువే వస్తుంది. అప్పుడెప్పుడో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన “సైతాన్” సినిమా మంచి హిట్ అయింది. కానీ అది చిన్న సినిమాగా విడుదలై కంటెంట్ వల్ల సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత క్రూ అనే మరో చిన్న సినిమా హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ సరైన హిట్ లేదు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ల కే సవాలు విసురుతూ ఓ చిన్న సినిమా రెండు వారాల కింద రిలీజ్ అయి మంచి టాక్ తో భారీ వసూళ్లు రాబడుతుంది.

Munjya Movie 2 weeks collections

భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ముంజ్య…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో రెండు వారాల కింద రిలీజ్ అయిన ముంజ్య (Munjya) అనే చిన్న సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. మిగిలిన సినిమాలు పెద్దగా ఇంపాక్ట్ ని చూపించలేకపోవడంతో ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో, సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఉందని భావించగా, ముంజ్య సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయింది. ఇక ఈ సినిమా అనూహ్యంగా పాజిటివ్ టాక్ తో మొదటి రోజు మొదలు కొని ఇప్పటివరకూ ప్రతి రోజు 4 కోట్లకు తగ్గని నెట్ కలెక్షన్స్ ని సాధిస్తూ వచ్చింది. మొదటి వారం లో మంచి కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా రెండు వారం కూడా ఏమాత్రం తీసిపోని విధంగా ఆల్మోస్ట్ దానికి ఈక్వెల్ రేంజ్ లో వసూళ్లు సాధించి,సెన్సేషనల్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక మొదటి వారంలో ఈ సినిమా 36.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని రచ్చ చేయగా, రెండో వారం కూడా స్టడీగా సాగుతూ ఆల్ మోస్ట్ 34.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. మొదటి వీక్ తో పోల్చితే 2 కోట్లు మాత్రమే డ్రాప్ అయ్యింది.

- Advertisement -

స్టార్లకు సవాల్ విసురుతున్న చిన్న సినిమా!

ఇక ముంజ్య సినిమా టోటల్ గా 2 వారాల్లో సినిమా ఇండియాలో, 71 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 15 వ రోజు కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 75 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక వచ్చే వీక్ లో కల్కి2898AD ఉన్నప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో ఈ సినిమా కూడా ఉండే అవకాశం ఉండటంతో 90-100 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో సినిమా రచ్చ లేపే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయితే అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ఇంకా బాలీవుడ్ ఖాన్ల సినిమాలు సరైన కంటెంట్ ఉన్న సినిమాలు చేయక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడితే, మౌత్ టాక్ తో చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ బాసూల్లు రాబడుతున్న ముంజ్య సినిమా నుండి స్టార్ హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని నెటిజన్లు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు