Munjya Movie : బాలీవుడ్ లో రచ్చ చేస్తున్న చిన్న సినిమా.. మరో హిట్టు వచ్చినట్టే!

Munjya Movie : బాలీవుడ్ లో ఈ మధ్య ఏ సినిమా రిలీజ్ అయినా అంతగా ఆడడం లేదని తెలిసిందే. బడా స్టార్లు హీరోలుగా నటించినా, భారీ అంచనాలతో సినిమాలు రిలీజ్ అయినా కూడా, ప్రేక్షకులు రిజెక్ట్ చేయడంలో ముందుంటారు. ఎందుకంటే కంటెంట్ బేస్డ్ సినిమాలు బాలీవుడ్ లో తగ్గిపోయాయన్న విషయం కూడా తెలిసిందే. ఇక ఈ ఏడాది హిట్ సినిమాల లెక్కను చూస్తే.. చేతివేళ్ళు కూడా ఎక్కువే అనిపిస్తుంది. అంత తక్కువగా సినిమాలు ఆడాయి. ఇక అప్పుడెప్పుడో బాలీవుడ్ లో సైతాన్ సినిమా మంచి విజయం సాధించగా, నెల కింద వచ్చిన ‘క్రూ’ లాంటి మరో రెండు చిన్న సినిమాలు తప్ప పెద్దగా ఏ సినిమా కూడా హిట్ గీత దాటలేదు. మొత్తంగా కొన్ని నెలలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో నిఖార్సైన రేంజ్ లో హిట్స్ పడటం లేదు. సమ్మర్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకున్న తర్వాత, తాజాగా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా ఒక హర్రర్ కామెడీ మూవీ రచ్చ లేపింది. బాలీవుడ్ లో స్త్రీ, భేడియా లాంటి హర్రర్ యూనివర్స్ ను క్రియేట్ చేయగా, ఇప్పుడు అందులో భాగంగా వచ్చిన లేటెస్ట్ మూవీ “ముంజ్య” (Munjya Movie) ట్రైలర్ రిలీజ్ తో మంచి హైప్ ను అందుకుంది.

Munjya Movie Collections

మంచి ఓపెనింగ్స్ అందుకున్న ముంజ్య..

ఇక అసలు స్టార్ కాస్ట్ ఏంటో కూడా ఎవ్వరికీ తెలియని ఈ సినిమా జస్ట్ ట్రైలర్ రిలీజ్ తో హైప్ ను దక్కించుకుని స్త్రీ, భేడియా హర్రర్ యూనివర్స్ లో భాగం అని చెప్పడంతో శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఈ సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది. చిన్న ఏజ్ లోనే చనిపోయిన ఒక ఆత్మ కొంత టైం తర్వాత హీరోని పట్టి వేదిస్తుంది. దాని వెనక రీజన్ ఏంటి, హీరో ఆ దెయ్యం నుండి విముక్తి కోసం ఏమేమి చేశాడు, స్త్రీ, భేడియా యూనివర్స్ కి “ముంజ్య” సినిమాని ఎలా లింక్ చేశారు లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ సినిమా కథ సింపుల్ గానే అనిపించినా కూడా, ఆడియన్స్ ఆలోచించడానికి పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా స్క్రీన్ ప్లే పరంగా డైరెక్టర్ మ్యాజిక్ చేయగా, కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓవరాల్ గా మంచి హర్రర్ మూవీ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా మిక్స్ చేయడంతో బాగుంది అనిపించేలా మెప్పించింది సినిమా.

- Advertisement -

బాలీవుడ్ లో మరో హిట్ లోడింగ్…

ఇక బాలీవుడ్ లో పెద్దగా స్టార్ కాస్ట్ కూడా లేని ముంజ్య సినిమా మొదటి రోజు 110K టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా, ఇక ఇండియాలో మొదటి రోజు 4.2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి స్టార్ట్ ను దక్కించుకోగా, వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇక బాలీవుడ్ లో గత కొంతకాలంగా సరైన హిట్ సినిమాలు లేకపోగా, చిన్న సినిమాలే మధ్యలో ఆడుతున్నాయి. ఇక ఇప్పుడు ముంజ్య సినిమాతో మరో హిట్ బాలీవుడ్ లో లోడ్ అవుతుందని అంటున్నారు నెటిజన్లు. ఈ సినిమా మొదటివారం 50 కోట్ల వరకు వసూలు చేయొచ్చని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు