Munjya Collections : బాలీవుడ్ లో దుమ్ము లేపుతున్న చిన్న సినిమా!

Munjya Collections  : బాలీవుడ్ లో ఈ మధ్య వచ్చిన సినిమాలు పెద్దగా ఆడడం లేదు. పెద్ద సినిమాల సంగతి పక్కన బెడితే, ఓ మోస్తరు సినిమాలు కూడా చాలా వరకు నిరాశ పరిచాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ సీజన్ కూడా ఆల్ మోస్ట్ అయిపొయింది. ఎలక్షన్స్ ఫీవర్ వలన చాలా వరకు ఇండస్ట్రీలలో అనుకున్న రేంజ్ లో సినిమాలు పడలేదు. ఇప్పుడు అన్నీ సెట్ అవుతూ ఉండటంతో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన చిన్న సినిమా ఒకటి సెన్సేషనల్ కలెక్షన్స్ తో వీకెండ్ లో దుమ్ము లేపింది. ఇక ఆ సినిమా గురించి వస్తే సినిమా పేరు “ముంజ్యా”. అసలు స్టార్ కాస్ట్ గురించి కూడా పెద్దగా తెలియని ముంజ్య (Munjya) అనే సినిమా జస్ట్ ట్రైలర్ తోనే మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. దాంతో ఈ సినిమా మీద ఆడియన్స్ లో ఆసక్తి నెలకొనగా రిలీజ్ అయిన తర్వాత పర్వాలేదు బాగుంది, అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది.

Munjya Movie First week collections

పాజిటివ్ టాక్ తో రోజురోజుకు గ్రోత్…

ఇక ముంజ్య సినిమా మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం ఎక్స్ లెంట్ గా జోరుని చూపించింది. వీకెండ్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టినా, సినిమా ఏమాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకోకుండా ప్రతీ రోజూ సాలిడ్ హోల్డ్ ని చూపెడుతూ ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. సినిమా మొదటి వారంలో ప్రతీ రోజూ 4 కోట్లకు తగ్గకుండా నెట్ కలెక్షన్స్ ని అన్ని రోజులు సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. 4వ రోజు నుండి సినిమా మొదటి రోజు లెవల్ లో హోల్డ్ ని చూపెడుతూ ఉండగా 7వ రోజు వరకు కూడా 4 కోట్లకు తగ్గకుండా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. 6వ రోజు 4.11 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 7వ రోజున సినిమా మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి 4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. దాంతో ఓవరాల్ గా మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి 36.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుంది.

- Advertisement -

75 కోట్ల దిశగా…

ఇక ముంజ్య సినిమా రెండో వీకెండ్ లో మూవీ మళ్ళీ రాంపెజ్ ను చూపించే అవకాశం ఉండగా, రెండో వీకెండ్ కలెక్షన్స్ తో 50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, లాంగ్ రన్ లో అవలీలగా 75 కోట్ల క్లబ్ లో సినిమా చేరే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. రీసెంట్ టైంలో బాలీవుడ్ లో వచ్చిన మూవీస్ లో చాలా లిమిటెడ్ డ్రాప్స్ తో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా ఇదేనని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా జస్ట్ ట్రైలర్ రిలీజ్ తో హైప్ ను దక్కించుకోగా, బాలీవుడ్ లో హిట్ అయిన స్త్రీ, భేడియా హర్రర్ యూనివర్స్ లో భాగం అని చెప్పడంతో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది. చిన్న ఏజ్ లోనే చనిపోయిన ఒక ఆత్మ కొంత టైం తర్వాత హీరోని పట్టి వేదిస్తుంది. దాని వెనక రీజన్ ఏంటి, హీరో ఆ దెయ్యం నుండి విముక్తి కోసం ఏమేమి చేశాడు, స్త్రీ, భేడియా యూనివర్స్ కి “ముంజ్య” సినిమాని ఎలా లింక్ చేశారు లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో మంచి హర్రర్ మూవీ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ చేయడంతో బాగుంది అనిపించేలా మెప్పించింది సినిమా.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు