Munjya Movie : ట్రేడ్ వర్గాలకే షాకిస్తున్న చిన్న సినిమా..! ఊహించని కలెక్షన్లు

Munjya Movie : బాలీవుడ్ లో ఈ మధ్య వచ్చిన సినిమాలు పెద్దగా ఆడడం లేదు. పెద్ద సినిమాల సంగతి పక్కన బెడితే, ఓ మోస్తరు సినిమాలు కూడా చాలా వరకు నిరాశ పరిచాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ సీజన్ కూడా ఆల్ మోస్ట్ అయిపొయింది. ఎలక్షన్స్ ఫీవర్ వలన చాలా వరకు ఇండస్ట్రీలలో అనుకున్న రేంజ్ లో సినిమాలు పడలేదు. ఇప్పుడు అన్నీ సెట్ అవుతూ ఉండటంతో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన చిన్న సినిమా ఒకటి సెన్సేషనల్ కలెక్షన్స్ తో వీకెండ్ లో దుమ్ము లేపింది. ఇక ఆ దాని గురించి వస్తే సినిమా పేరు “ముంజ్యా”. అసలు స్టార్ కాస్ట్ గురించి కూడా పెద్దగా తెలియని ముంజ్య (Munjya Movie) అనే సినిమా జస్ట్ ట్రైలర్ తోనే మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. దాంతో ఈ సినిమా మీద ఆడియన్స్ లో ఆసక్తి నెలకొనగా రిలీజ్ అయిన తర్వాత పర్వాలేదు బాగుంది, అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది.

Munjya Movie weekend collections

స్క్రీన్ ప్లే బలంతో..

ఇక ఈ సినిమా జస్ట్ ట్రైలర్ రిలీజ్ తో హైప్ ను దక్కించుకోగా, బాలీవుడ్ లో హిట్ అయిన స్త్రీ, భేడియా హర్రర్ యూనివర్స్ లో భాగం అని చెప్పడంతో శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఈ సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది. చిన్న ఏజ్ లోనే చనిపోయిన ఒక ఆత్మ కొంత టైం తర్వాత హీరోని పట్టి వేదిస్తుంది. దాని వెనక రీజన్ ఏంటి, హీరో ఆ దెయ్యం నుండి విముక్తి కోసం ఏమేమి చేశాడు, స్త్రీ, భేడియా యూనివర్స్ కి “ముంజ్య” సినిమాని ఎలా లింక్ చేశారు లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ సినిమా కథ సింపుల్ గానే అనిపించినా కూడా, ఆడియన్స్ ఆలోచించడానికి పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ మ్యాజిక్ చేయగా, కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓవరాల్ గా మంచి హర్రర్ మూవీ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ చేయడంతో బాగుంది అనిపించేలా మెప్పించింది సినిమా.

- Advertisement -

వీకెండ్ లో అదరగొట్టిన చిన్న సినిమా..

ఇక ముంజ్య సినిమా బాలీవుడ్ లో మొదటి రోజున 4.21 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా, రెండో రోజు దుమ్ము లేపుతూ 7.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు సండే మరింత జోరుగా హోల్డ్ ని చూపించిన ఈ సినిమా 8.43 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా వీకెండ్ లో మొత్తం మీద ఏకంగా 20.04 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని అద్బుతమైన స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం విశేషం. పెద్దగా స్టార్ కాస్ట్ ఏంటో కూడా పెద్దగా తెలియని ఈ సినిమా ఇలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇక లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అవలీల 75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి తొలి వారం ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు