Murari ReRelease : మహేష్ మ్యానియా.. ఏకంగా ఖుషిని బ్రేక్ చేసేసిందే..

Murari ReRelease : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “మురారి” సినిమా మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా ఆగష్టు 9న రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా రీ రిలీజ్ పై ముందుగా డిమాండ్ లేకపోయినా, అనౌన్స్ చేసాక ఫ్యాన్స్ స్పెషల్ గా ఈ సినిమా కోసం సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేయగా, రీ రిలీజ్ డేట్ వచ్చేదాకా, మెల్లిగా రోజురోజుకూ ఆన్లైన్స్ లో బుకింగ్స్ పెరిగాయి. ఇక మురారి రీ రిలీజ్ కి థియేటర్లలో రెస్పాన్స్ కూడా అద్భుతంగా వచ్చేసిందని చెప్పాలి. థియేటర్లలో అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు.. ఏకంగా కొంతమంది లవర్స్ థియేటర్లలో పెళ్లిచేసుకున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక మహేష్ బాబు మురారి రీ రిలీజ్ లో కలెక్షన్లలో సరికొత్త రికార్డ్ ని సృష్టించాడు. ఒక క్లాస్ ఫ్యామిలీ సినిమాతో ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే మాములు విషయం కాదనే చెప్పాలి. ఇప్పుడు ఎవరూ ఊహించని రికార్డ్ సెట్ చేసాడు మహేష్ బాబు.

Murari movie all time record in re-release collections

మురారి అల్ టైం రికార్డ్… ఖుషిని బ్రేక్ చేసేసిందే..

ఇక మురారి సినిమా రీ రిలీజ్ కి ఓవర్సీస్ లో కూడా సాలిడ్ రెస్పాన్స్ రాగా, రీ రిలీజ్ లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఒక్క నైజాం ఏరియాలోని తొలిరోజు మురారి 2.90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తెచ్చుకుని అల్ టైం రికార్డ్ సెట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా మురారి తొలిరోజు 5.45 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. తొలి రోజు కలెక్షన్లలో భారీ రికార్డ్ సెట్ చేసిన మురారి, రెండో రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది. ఇక మూడో రోజు తో ఏకంగా రీ రిలీజ్ రికార్డులన్నిటిని బ్రేక్ చేసేసింది. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా రీ రిలీజ్ లో 7.76 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్పుడు మురారి సినిమా రెండు రోజుల్లోనే 7.32 కోట్ల కలెక్షన్స్ సాధించగా, మూడో రోజుతో ఖుషిని పూర్తిగా బ్రేక్ చేసేసింది.

- Advertisement -

బెంచ్ మార్క్ సెట్ చేసేస్తుందా?

ఇక మురారి సినిమా మూడో రోజుల్లో 8.21 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిందని సమాచారం. టాలీవుడ్ లో రీ రిలీజ్ పరంగా ఖుషి ని బ్రేక్ చేసి మొదటి స్థానంలో మురారి నిలవగా, సౌత్ పరంగా దళపతి విజయ్ గిల్లి నిలిచింది. ఆ సినిమా ఏకంగా 32 కోట్లతో టాప్ లో ఉంది. ఇక మురారి గిల్లిని బ్రేక్ చేయకపోయినా, టాలీవుడ్ లో రీ రిలీజ్ లో ఏ బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అన్న టాక్ వినబడుతుంది. లాంగ్ రన్ లో 10 కోట్ల మార్క్ దాటుతుందని సమాచారం. మరి త్వరలో రీ రిలీజ్ కాబోతున్న గబ్బర్ సింగ్, ఇంద్ర వంటి సినిమాలతో మురారి రికార్డులు బ్రేక్ అవుతాయో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు