Murari ReRelease Collections : మరోసారి సత్తా చాటిన సూపర్ స్టార్.. పవన్ తర్వాత మహేషే..

Murari ReRelease Collections : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “మురారి” సినిమా మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా ఆగష్టు 9న రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే తెలిసిందే. నిజానికి ఈ సినిమా రీ రిలీజ్ పై ముందుగా డిమాండ్ లేకపోయినా, అనౌన్స్ చేసాక, ఫ్యాన్స్ స్పెషల్ గా ఈ సినిమా కోసం సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేయగా, రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి అంచనాలతో రోజురోజుకూ ఆన్లైన్స్ లో బుకింగ్స్ పెరిగాయి. ఇక మురారి థియేటర్లలో రీ రిలీజ్ కి రెస్పాన్స్ కూడా అద్భుతంగా వచ్చేసిందని చెప్పాలి. థియేటర్లలో అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు.. ఏకంగా కొంతమంది లవర్స్ థియేటర్లలో పెళ్లిచేసుకున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక మురారి ఫస్ట్ కలెక్షన్లు వచ్చేయగా, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన సత్తా చాటాడని చెప్పాలి.

Murari ReRelease First day Collections

రీ రిలీజ్ లో సూపర్ స్టార్ ట్రెండ్.. ఇక్కడైతే అల్ టైం రికార్డ్…

ఇక మురారి సినిమా రీ రిలీజ్ కి ఓవర్సీస్ సహా ప్రతి చోట భారీ స్పందన దక్కిందని చెప్పాలి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే తెలుగు రాష్ట్రాల్లో 2.26 కోట్ల వ‌ర‌కు రాగా, ఒక్క హైద‌రాబాద్‌ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1.60 కోట్ల బుకింగ్స్ వచ్చాయి. ఇక రీ రిలీజ్ లో మరోసారి మహేష్ ట్రెండ్ సెట్ చేసాడని చెప్పాలి. మురారి సినిమా మొదటి రోజు ఒక్క నైజాం లోనే 2.90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇది నైజాం లో ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి. తర్వాతి రెండో స్థానంలో బిజినెస్ మెన్, మూడో స్థానంలో ఖుషి సినిమాలున్నాయి. ఇక ఓవర్సీస్ లో కూడా మురారి ఏకంగా 48k డాలర్ల దాకా ఓపెనింగ్స్ తెచ్చుకోవడం విశేషం.

- Advertisement -

పవన్ తర్వాత మహేషే..

ఇక మురారి సినిమా వరల్డ్ వైడ్ గా 5.60 కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం. కానీ ఇంకా కొన్ని చోట్ల నుండి అప్డేట్ కావాల్సి ఉంది. ఇక రీ రిలీజ్ కలెక్షన్లలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా ఏకంగా 7.76 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక రెండో స్థానంలో మహేష్ బాబు బిజినెస్‌మెన్ 5.90 కోట్లతో ఉండగా, మూడో స్థానంలో మురారి నిలిచినట్టు తెలుస్తుంది. ఇక మురారి రెండో రోజు కూడా 20 ల‌క్ష‌ల‌కు పైగానే బుకింగ్స్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఇక బిజినెస్‌మెన్ రికార్డును ఈజీగా మురారి బ్రేక్ చేస్తుంద‌ని అంటున్నారు. అయితే ఓవరాల్ గా రీ రిలీజ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఖుషి రికార్డ్ బ్రేక్ అవుతుందా లేదా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు