Kalki2898AD : ఆ గడ్డపై ఓన్ రికార్డును కూడా కొట్టలేకపోయాడు.. తప్పెక్కడ జరిగింది?

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “కల్కి2898AD” మూవీ వరల్డ్ వైడ్ గా జూన్ 27న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అన్ని చోట్ల మంచి ఓపెనింగ్స్ సాధించింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి మైథాలజీ టచ్ ఇవ్వడం వల్ల ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతుండగా, అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ అభిమానులు కూడా కల్కి ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ డై హార్డ్ ఫ్యాన్స్ కి ఎన్నో ఎల్లా తర్వాత ఈ సినిమా మంచి ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రభాస్ తో ఈక్వల్ ఎలివేషన్లు అమితాబ్ కి పడడం విశేషం. అలాగే కమల్ హాసన్ తక్కువ సేపే కనిపించినా, తాను ఉన్నంత వరకూ సినిమాని తన పాత్రతో మరో మెట్టు ఎక్కించాడని చెప్పాలి. ఇక కల్కి (Kalki2898AD) సినిమా థియేటర్లలో మొదటి రోజు అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్ సాధించింది. అల్ టైం రికార్డులు కొట్టకపోయినా, RRR, బాహుబలి 2 తర్వాత మూడో స్థానంలో నిలిచింది.

Prabhas Kalki2898AD movie Ceded 1st day collections

ఆ గడ్డపై సొంత రికార్డు కూడా కొట్టలేదు…

ఇక కల్కి మూవీ బోసిపోయిన సమ్మర్ ముగిసిన మూడు నెలల తర్వాత నిఖార్సైన హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక మొదటి రోజు కల్కి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే దాదాపు అన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్లు నమోదు చేసిందని చెప్పొచ్చు. అయితే అల్ టైం రికార్డులు వస్తాయని అనుకుంటే ఆ రికార్డులకు చేరువగా వచ్చి ఆగిపోగా, ఒక్క ఏరియాలో మాత్రం కల్కి నిరాశపరిచాడనే చెప్పాలి. ఆ ఏరియా “రాయలసీమ”. ఈ ఏరియాలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు అక్కడి ఆడియన్స్. అయితే అన్ని చోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించిన కల్కి ఒక్క రాయలసీమ ఏరియాకి వచ్చే సరికి తడబడ్డాడు. మరీ అల్ టైం రికార్డులు కాకపోయినా, టాప్ 2 లేదా, టాప్ 3 లో ఉంటుందని అనుకున్నారు. కానీ కల్కి దానికి దూరంగానే ఆగిందని చెప్పొచ్చు.

- Advertisement -

రాయలసీమ గడ్డపై ఫస్ట్ డే ఓపెనింగ్స్…

ఇక రాయలసీమ లో మొదటి రోజు కల్కి2898AD సినిమాకి 5.12 కోట్ల రేంజ్ లో షేర్ రావడం జరిగింది. ఇక ఈ ఏరియాలో ఓవరాల్ గా 7వ స్థానంతో కల్కి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్కసారి సీడెడ్ గడ్డపై టాప్ ఓపెనింగ్స్ ని గమనిస్తే…

RRR 17కోట్లు షేర్
వినయ విధేయరామ 7.15 కోట్లు
వీర సింహారెడ్డి 6.55కోట్లు
సలార్ 6.45కోట్లు
బాహుబలి 2- 6.35 కోట్లు
సైరా 5.91 కోట్లు
అరవిందసమేత 5.48కోట్లు
కల్కి2898AD 5.12కోట్లు **
బాహుబలి – 5.08 కోట్లు

అయితే కల్కితో ప్రభాస్ కనీసం ఓన్ రికార్డ్ అయిన సలార్ ని అయినా బ్రేక్ చేస్తాడని అనుకున్నా కుదరలేదు. మొత్తం మీద మొదటి రోజు ఇలా ఒక చోట హై గా, కొన్ని చోట్ల లో గా ఉన్నా, వరల్డ్ వైడ్ గా భారీగానే వచ్చాయి. ఇక కల్కి సినిమా రెండో రోజు ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. రెండో రోజుతో కల్కి 300 కోట్ల గ్రాస్ మార్క్ దాటే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు