Kalki2898AD : కల్కి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే! ఏడేళ్ల తర్వాత అక్కడ రికార్డు!

Kalki2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD మూవీ జూన్ 27న రిలీజ్ అయి మంచి టాక్ తో కలెక్షన్ల భీభత్సం సృష్టిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ని ఈ సినిమా అందించిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా లో పాన్ ఇండియా స్టార్స్ ఉండడం వల్ల అన్ని భాషల్లోనూ భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ థియేటర్లలో రచ్చ చేస్తుంది. ఇక ప్రీమియర్స్ నుండే కొత్త రికార్డులు సెట్ చేస్తూ వస్తున్న కల్కి, తొలిరోజు నుండే రికార్డుల వేట సాగిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు అందుకుంటుంది కల్కి. ఇక వీకెండ్ లోనే దాదాపు 500 కోట్లకు వసూలు చేసి రచ్చ చేసిన కల్కి, ఐదవ రోజుతో వర్కింగ్ డే లోకి అడుగుపెట్టింది. ఇక వర్కింగ్ డే లో కూడా కల్కి మంచి కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా ఐదు రోజులు పూర్తయ్యే సరికి కల్కి సినిమా ఓ ఏరియాలో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోవడం విశేషం.

Prabhas starrer Kalki2898AD has broken even in Kerala

కల్కి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే!

ప్రభాస్ నటించిన కల్కి సినిమా దాదాపు 380 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ని చేయగా, విడుదలైన 5 రోజుల్లో ఒక ఏరియాలో వాల్యూ బిజినెస్ ను దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాని కంప్లీట్ చేసుకుంది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు, కల్కి బ్రేక్ ఈవెన్ అయింది కేరళలో. తాజాగా ఇక్కడ ప్రభాస్ కల్కి సినిమా యానానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, మంచి కలెక్షన్లు వసూలు చేస్తూ కేవలం ఐదు రోజుల్లోనే బ్రెక్ ఈవెన్ అయింది. అయితే మిగిలిన ప్రభాస్ నటించిన బాహుబలి తర్వాత ఈ ఏరియాలో ప్రభాస్ యొక్క ఏ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు సరికదా, టార్గెట్ లో సగం కూడా దాటలేకపోయాయి. ఉన్నంతలో లాస్ట్ ఇయర్ వచ్చిన సలార్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చి ఆగగా, అది కూడా పృత్వి రాజ్ క్రెడిట్ లోకి వెళ్తుంది. ఇక ఇప్పుడు కల్కి మూవీ రోజు రోజుకి కలెక్షన్స్ లో గ్రోత్ ని చూపించి ఐదవ రోజుకే బ్రేక్ ఈవెన్ అయింది.

- Advertisement -

ఏడేళ్ల తర్వాత బ్రేక్ ఈవెన్..

ఇక కల్కి సినిమా కేరళలో ఓవరాల్ గా సినిమా 6 కోట్ల రేంజ్ లో ఇక్కడ వాల్యూ బిజినెస్ ను సాధించగా 4 రోజులు పూర్తి అయ్యే టైంకే ఇక్కడ 5.80 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఐదో రోజు దాదాపు 50 లక్షలకి పైగా షేర్ వసూలు చేసినట్టు అంచనా. ఐదవరోజుతో ప్రాఫిట్ లోకి అడుగుపెట్టిన కల్కి కేరళలో మంచి హోల్డ్ ని చూపిస్తూ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇక బాహుబలి2 తర్వాత ఏడేళ్లకు ప్రభాస్ సినిమా కేరళలో బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పాలి. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తుండగా, హిందీలో మాత్రం కల్కి వేరే లెవెల్లోఆడేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే హిందీలోనే 130 కోట్ల వసూళ్లు దాటేసిన కల్కి 200 కోట్ల దిశగా దూసుకుపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు