Prathinidhi2 : ప్రతినిధి2 డే వన్ లెక్క.. మంచి అడ్వాంటేజ్ ని క్యాష్ చేసుకోలేకపోయారు..!

Prathinidhi2 : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత నటించిన సినిమా “ప్రతినిధి2”. ఈ సినిమా నారా రోహిత్ గతంలో నటించిన ప్రతినిధి సినిమాకి సీక్వేల్ గా తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా మెప్పించడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా (Prathinidhi2) ఫైనల్ గా మే 10న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ మూవీతో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాయి. ఇక నారా రోహిత్ దాదాపు ఏడేళ్ల తర్వాత సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా థియేటర్లలో మిక్సడ్ రెస్పాన్స్ లని సాధించినది. అయితే ప్రజెంట్ ఎలక్షన్స్ ఫీవర్ మరో లెవల్ లో ఉండటంతో ఈ సినిమా ఆ అడ్వాంటేజ్ ను వాడుకుంటుందని, మంచి ఓపెనింగ్స్ ను అందుకుంటుందని అనుకున్నా కూడా సినిమాకి మొదటి ఆటకే బిలో పార్ టాక్ అయితే సొంతం అయ్యింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా కూడా ఏమాత్రం జోరుని చూపించ లేక పోయింది.

డిజాస్టర్ ఓపెనింగ్స్..

ఇక ప్రతినిధి 2 సినిమా మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో 5 వేల లోపు టికెట్ సేల్స్ ను కూడా సొంతం చేసుకోలేక పోయింది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా పెద్దగా జోరు చూపించ లేక పోయిన సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల లోపు గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుందని సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా 45 లక్షల లోపు గ్రాస్ ను అందుకుందని సమాచారం. మొత్తం మీద మొదటి రోజు షేర్ లెక్క 22 లక్షల రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల థియేటర్లలో నిల్ అవడంతో మైనస్ కలెక్షన్లు వచ్చాయి. అవన్నీ లెక్కలు తీసేస్తే గాని అసలు లెక్కలు తేల్చలేం. ఇక మొత్తం మీద రీసెంట్ టైంలో వచ్చిన పొలిటికల్ మూవీస్ మాదిరిగానే ప్రతినిధి2 సినిమా కూడా పెద్దగా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడంలో విఫలం అయింది. సినిమా ఓవరాల్ గా వాల్యూ టార్గెట్ రేంజ్ 3.50 కోట్ల దాకా ఉండగా సినిమా మొదటి రోజు నిరాశ కలిగించే ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంది.

అడ్వాంటేజ్ ని క్యాష్ చేసుకోలేదు..

ఇక రిలీజ్ అయ్యాక ప్రతినిధి2 సినిమాకి మొత్తం మీద ఎవరూ పెద్దగా ఎక్కువ కలెక్షన్స్ ఎక్స్ పెర్ట్ చేయలేదు, కానీ ఖాళీగా ఉన్న థియేటర్స్ లో ఎంతో కొంత ఫీడింగ్ ఉంటుంది అనుకున్నా కూడా జనాలను థియేటర్స్ కి ఏ సినిమాలు కూడా పెద్దగా రప్పించ లేక పోతున్నాయి. ఇక వీకెండ్ లో ప్రతినిధి2 సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. అయితే నిజం చెప్పాలంటే ప్రతినిధి2 మంచి వీక్ అడ్వాంటేజ్ ని మిస్ చేసుకుందని చెప్పాలి. సినిమాలో కంటెంట్ బాగుంటే ఇప్పుడు జనాలు థియేటర్లకు వచ్చి ప్రశంసలు కురిపిస్తే, ఆ ఎఫెక్ట్ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉండేది. అలా చిత్ర యూనిట్ పై కూడా ప్రశంసలు కురిసేవి. పైగా నెలన్నర గా హిట్ లేని ఇండస్ట్రీ కి మంచి ఊపు తెచ్చేది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు