Premalu: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశగా..

టాలీవుడ్ లో గత వారం రిలీజ్ అయిన సినిమాల్లో డబ్బింగ్ సినిమా ‘ప్రేమలు’ కూడా ఒకటి. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో ముందు నుండి అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ నెల క్రితమే మలయాళం లో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తాజాగా తెలుగులో మహా శివరాత్రి కానుకగా మార్చి 8న తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇక ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు కార్తికేయ స్వయంగా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం విశేషం. ఇక గత వారం లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాల్లో మలయాళం నుండి డబ్ అయి రిలీజ్ అయిన ప్రేమలు ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా, రెండో వారంలోకి ఎంటర్ అయ్యే సరికి లాభాల బాట పట్టింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చేయగా, వర్కింగ్ డేస్ లో కాస్త స్లో అయింది. కానీ రెండో వీకెండ్ వచ్చేసరికి థియేటర్ల సంఖ్య పెరిగి కలెక్షన్లు పుంజుకున్నాయి.

చిన్న సినిమాగా రచ్చ..

అయితే మార్చి 8న థియేటర్లలో తెలుగులో గామి, భీమా వంటి పలు క్రేజీ సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈ సినిమాకు యూత్ ఎగబడ్డారు. హైదరాబాద్ వంటి పలు సిటీ ఏరియాల్లో ప్రేమలు సినిమాకే ఆడియన్స్ ఓటు వేశారు. ఫస్ట్ వీక్ చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రోజు రోజుకి తెలుగులో మంచి గ్రోత్ చూపించి బ్రేక్ ఈవెన్ అయింది. ఇక రెండో వారంలోకి ఎంటర్ అయ్యే సరికి థియేటర్ల సంఖ్యని కూడా పెంచుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 9 వ రోజు ఫస్ట్ టైం కోటికి పైగా గ్రాస్ ను అందుకోగా సెకెండ్ వీకెండ్ లో సినిమా ఎక్స్ లెంట్ గా గ్రోత్ ని చూపించింది. ఇక ఓవర్సీస్ లో కూడా ఇప్పటికే 225k గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. ఇక 9రోజుల్లో ప్రేమలు వరల్డ్ వైడ్ గా తెలుగు వెర్షన్ 3.16 కోట్ల షేర్, 5. 55 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఇక పదో రోజు ఆది వారం వీకెండ్ తో మరింత రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు. ఇక కార్తికేయ ఈ సినిమాని కేవలం 1.2 కోట్లకి కొనుక్కోగా, 1.5 కోట్ల టార్గెట్ కి రెట్టింపు వసూలు చేసిన ప్రేమలు కార్తికేయ కి లాంగ్ రన్ లో లాభాల పంట ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు.

- Advertisement -

మలయాళం టాప్ 5 లో ప్రేమలు..

ఇక ప్రేమలు మలయాళం రిలీజ్ అయ్యి ఇప్పటికే నెల పూర్తయిపోగా, తాజాగా ఇప్పటివరకూ 5 వారాలు పూర్తి చేసుకోగా, టోటల్ గా సాధించిన మలయాళం కలెక్షన్స్ తో పాటూ, తెలుగు వెర్షన్ కలెక్షన్లు కలిపి ఏకంగా 110 కోట్ల గ్రాస్ దాటేయడం విశేషం. కాగా షేర్ వాల్యూ 51 కోట్ల వరకు ఉంటుంది. ఓవరాల్ గా ప్రేమలు సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఆల్ మోస్ట్ టాప్ మలయాళం గ్రాసర్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక ఇప్పటికే మలయాళంలో మంజుమ్మేల్ బాయ్స్ బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక ప్రేమలు ఈ ఇయర్ మంజుమ్మేల్ బాయ్స్ తరువాత సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలవగా ఓవరాల్ గా మలయాళం లో టాప్ 5 లో నాలుగవ స్థానంలో నిలిచింది. మరి ఓవరాల్ గా ఎంతవరకు కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు