Premalu Telugu Movie Collections: డబ్బింగ్ సినిమాకు తెలుగోళ్లు ఫిదా… మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

‘పొరుగింటి పుల్లకూర రుచి’ ఇది పాత సామేత అయినా, ఎప్పటికప్పుడు ప్రూవ్ అయ్యే సామేత అని చెప్పుకోవచ్చు. తెలుగు ఆడియన్స్‌కి తెలుగులో ఎంత పెద్ద సినిమా వచ్చినా, చాలా విమర్శలు చేస్తారు. కానీ, ఇతర భాషల్లో వచ్చే చిన్న సినిమాలను కూడా నెత్తిన పెట్టుకుంటారు. దీనికి ఉదహారించి చెప్పడానికి చాలా సినిమాలు ఉన్నాయి. లెటేస్ట్ గా చెప్పాలంటే.. శివరాత్రి సందర్భంగా తెలుగులో విడుదలైన ప్రేమలు సినిమా.

తెలుగులో డబ్బింగ్ సినిమా హవా…
ఎస్ ఎస్ కార్తికేయ ఫస్ట్ టైం డిస్టిబ్యూటర్ గా మారి రిలీజ్ చేసిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. గామి, భీమా లాంటి సినిమాలకు ప్రేమలు మూవీ పోటీ ఇచ్చిందంటే… తెలుగు ఆడియన్స్ ను ప్రేమలు ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్ లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ప్రేమలు సినిమాకు 1.5 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందులో 80 లక్షల వరకు నైజంలో ఏరియాలో వచ్చాయని, ఆంధ్రలోని అన్ని సెంటర్ లలో కలిపి దాదాపు 70 లక్షల వరకు వసూళ్లు అయ్యాయని తెలుస్తుంది.

ఓవర్సీస్‌లోనూ…
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ఈ తెలుగు వెర్షన్ ప్రేమలు సినిమాకు ఓవర్సీస్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఓవర్సీస్ లో ప్రేమలు తెలుగు వెర్షన్ కి ఫస్ట్ డే 19 వేల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు 15 లక్షలు) ఇప్పుడు వీకెండ్ కాబట్టి ఈ నెంబర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అంతే కాదు, మలయాళంలో ఈ మూవీ 100 కోట్ల వైపు అడుగులు వేస్తుంది. దాని ప్రభావం కూడా ఉండే ఛాన్స్ ఉంది.

- Advertisement -

మలయాళంలో సూపర్ హిట్..
మలయాళంలో ఫిబ్రవరి 09న ప్రేమలు అనే ఓ సినిమా రిలీజ్ అయింది. జస్ట్ 3 కోట్ల బడ్జెట్ తో వచ్చిన మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిన్న పాయింట్ అయినా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇక్కడ సూపర్ హిట్ టాక్ రావడంతో ఇతర భాషల్లో కూడా ఆడియన్స్ ప్రేమలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా టాలీవుడ్ లాంటి పక్క ఇండస్ట్రీల్లో రిలీజ్ చేయడానికి డిస్టిబ్యూటర్స్ ముందుకు వస్తున్నారు.

100 కోట్ల క్లబ్ దిశగా…
అప్పటికే ఈ మూవీ మలయాళంలో దాదాపు 90 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. 100 కోట్ల వైపునకు అడుగులు వేస్తోంది. మలయాళంలో చాలా తక్కువ సినిమాలు 100 కోట్ల మార్క్ ను టచ్ చేశాయి. ఇప్పుడు ఈ ప్రేమలు మూవీ కూడా ఈ క్లబ్ లో చేరడానికి రెడీ గా ఉంది. ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయి ఇప్పటి వరకు 29 రోజులు అవుతుంది. మరి కొన్ని రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంది.

మలయాళంలో 100 కోట్లు వసూళ్లు చేసిన సినిమాలు…
మలయాళం సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది. ఇక్కడి సినిమాలు బయటి ఇండస్ట్రీ వాళ్లు చూడటం ఈ మధ్యే స్టార్ట్ అయింది. 2018 లాంటి సినిమాలు మలయాళ ఇండస్ట్రీని ఇండియాకి పరిచయం చేశాయి. ఇప్పటి వరకు మలయాళంలో 100 కోట్లు వసూళ్లు చేసిన సినిమా కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి.

  • 2018 మూవీ : ఈ మూవీ మలయాళంలో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన మూవీ. 2018లో వచ్చిన వరదల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ 177 కోట్లను వసూళ్లు చేసింది.
  • పులిమురుగన్: మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ మలయాళంలో రెండో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టి మూవీ. ఈ చిత్రం తెలుగులో మన్యం పులి అనే పేరు తో రిలీజ్ అయింది. ఇది తెలుగులో కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమా మలయాళంలో 152 కోట్లను వసూళ్లు చేసింది.
  • లూసిఫర్: మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ప్రుథ్విరాజ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్ మూవీ మలయాళంలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాలో మూడోది. ఈ మూవీ మలయాళంలో 127 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు