Darling Movie : డార్లింగ్ మూవీ బిజినెస్ డిటైల్స్.. ప్రాఫిట్స్ రావాలంటే..

Darling Movie : ‘బలగం’ సినిమాతో హీరో అయిపోయాడు ప్రియదర్శి. దీనికి ముందు ఎన్నో సినిమాల్లో నటించినా.. కేవలం కమెడియన్ గా మాత్రమే ఫేమస్ అయ్యాడు.. ఈ సినిమా తర్వాత అతని రేంజ్ మారింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా డార్లింగ్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.. అయితే డార్లింగ్ బిజినెస్ డిటైల్స్ ప్రస్తుతం షాక్ ఇస్తున్నాయి.. ఆ బడ్జెట్ విషయాలేంటో ఒకసారి చూసేద్దాం…

డార్లింగ్ సినిమాకు మొత్తం బడ్జెట్ రూ.7 కోట్లని తెలుస్తుంది.. అయితే థియేరిటికల్ బిజినెస్ చూస్తే రూ. 7 కోట్లకు పై వచ్చినట్లు తెలుస్తుంది. ఇక నాన్ థియేరిటికల్ హక్కులు కూడా రూ. 8 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రమోషన్స్ కూడా డార్లింగ్ టీమ్ గట్టిగానే చేస్తున్నారు.. ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాకు కలెక్షన్స్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది.. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రియదర్శి అకౌంట్ లో మరో హిట్ సినిమా పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్..

priyadarshi darling movie bussiness details
priyadarshi darling movie bussiness details

కాగా, హీరో ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది.. ఈ సినిమా జూలై 19 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఇప్పటివరకు మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా రేపు థియేటర్లలో కి వచ్చిన తర్వాత ఎలా టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఈ సినిమా కూడా హిట్ అయితే ప్రియదర్శి స్టార్ హీరోల లిస్ట్ లోకి వెళ్లడం ఖాయం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు