Raayan Collections : రాయన్ ఫస్ట్ డే కలెక్షన్స్… బాక్సాఫీస్ దగ్గర ధనుష్ రాయల్ ఫార్మామెన్స్

Raayan Day 1 collections.. సౌత్ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టినప్పుడు ఎన్నో అవమానాలను భరించి , నేడు స్టార్ హీరోగా చలామణి అవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటనతో సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు తాజాగా వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈయన రాయన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు రాగా డీసెంట్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇకపోతే మొదటి రోజు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఫలితంగా కలెక్షన్లు కూడా బాగానే సొంతం చేసుకుంది ఈ సినిమా.. మరి రాయన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Raayan Day 1 collections: Royal first day collections.. Dhanush dusted..!
Raayan Day 1 collections: Royal first day collections.. Dhanush dusted..!

హిట్ టాక్ తో దూసుకుపోతున్న రాయన్..

కోలీవుడ్ బడా స్టార్ హీరో ధనుష్ నటించిన సినిమా రాయన్.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్ర పోషించారు. అపర్ణ బాలమురళి, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ముగ్గురు సోదరులు.. తప్పిపోయిన తమ సోదరిని వెతుకులాటకు వెళ్తే అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులు, అంతరాయాలు తమ చెల్లిని చేరుకున్నారా లేదా అనేది సినిమా కథ.. అన్నాచెల్లెళ్ల అనుబంధం మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

రాయన్ థియేట్రికల్ బిజినెస్..

ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా ఈ సినిమాకి హీరో ధనుష్ దర్శకత్వం వహించారు కూడా.. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాలలో భారీ డిమాండ్ పెరిగింది. తెలుగు రాష్ట్రాలలో రూ .5కోట్లు , తమిళం – రూ.28 కోట్లు, కర్ణాటక రూ .3కోట్లు , ఇతర రాష్ట్రాలలో రూ.1.5 కోట్లు, ఓవర్ సీస్లో రూ.7కోట్లు మొత్తం అన్ని ప్రాంతాలు కలిపి రూ .45 కోట్ల బిజినెస్ చేసిందని చెప్పవచ్చు. ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలలో కూడా మంచి కలెక్షన్ లతో అదరగొట్టేసింది.

- Advertisement -

రాయన్ ఫస్ట్ డే కలెక్షన్స్..

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 1600 స్క్రీన్ లలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాకి మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువగానే స్పందన లభించింది. ఫలితంగా రెండు రాష్ట్రాలలో కూడా రూ.1.20 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ .9కోట్ల వరకు షేర్ రాబట్టింది. అలాగే మొత్తం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్ల గ్రాస్ వసూల్ చేసి రికార్డు సృష్టించింది. మొత్తానికి అయితే ధనుష్ కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్ రికార్డ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది రాయన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు