Raayan Collections : వర్కింగ్ డే లోనూ రాయన్ స్ట్రాంగ్ హోల్డ్.. బ్రేక్ ఈవెన్ లాంఛనమే!

Raayan Collections : కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన 50వ సినిమా ‘రాయన్’ థియేటర్లలో అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొడుతుంది. జులై 26న థియేటర్లలో తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయిన రాయన్ ఫస్ట్ డే మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, ఆ తర్వాత అదిరిపోయే మౌత్ టాక్ తో స్టడీ కలెక్షన్లు వసూలు చేస్తుంది. స్వీయ దర్శకత్వంలో మొదటి సినిమా చేసిన ధనుష్ దర్శకుడిగానూ మంచి మార్కులు కొట్టేసాడు. ఇక రాయన్ సినిమా మొదటి వీకెండ్ లోనే ధనుష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించడమే కాకుండా, తన లాస్ట్ సినిమా కెప్టెన్ మిల్లర్ కలెక్షన్లను కూడా బ్రేక్ చేసింది. ఇక తాజాగా రాయన్ సినిమా వర్కింగ్ డే లోకి ఎంటర్ అవగా ఇప్పుడు కూడా స్టడీ కలెక్షన్లను సాధిస్తుంది.

Raayan Movie 5 days Collections

వర్కింగ్ డేలో స్ట్రాంగ్ హోల్డ్..

ఇక రాయన్ సినిమా తొలి మూడు రోజుల్లోనే 74 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా, వర్కింగ్ డే లో సగం డ్రాప్ అయినా స్టడీ హోల్డ్ ని కొనసాగిస్తోంది. విడుదలైన ఐదవ రోజు కూడా రాయన్ తెలుగు రాష్ట్రాల్లో 34 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా ఐదవ రోజు 6 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఇక రాయన్ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల కల్లెక్షన్లని గమనిస్తే…

- Advertisement -

తమిళనాడు – 43.15 కోట్లు
తెలుగు స్టేట్స్ – 8.55 కోట్లు
కర్ణాటక – 6 కోట్లు
కేరళ 3.30 కోట్లు
హిందీ & రెస్ట్ అఫ్ ఇండియా కలిపి మరో 2.15 కోట్లు
ఓవర్సీస్ 25.90 కోట్లు

వంద కోట్ల దిశగా రాయన్…

మొత్తం మీద 89.05 కోట్ల గ్రాస్ వసూలు చేసిన రాయన్ 42.55 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాయన్ మరో 3.45 కోట్ల షేర్ ని అందుకుంటే లాభాల్లోకి అడుగు పెడుతుంది. ఇక రెండో వీకెండ్ లో 100 కోట్లకి పైగా వసూలు చేసే దిశగా రాయన్ దూసుకుపోతూ ఉండగా, లాంగ్ రన్ లో నూట యాభై కోట్లకి పైగా కలెక్షన్లు వసూలు చేయొచ్చు. ఇక రాయన్ సినిమాలో ధనుష్ తో పాటు సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సినిమాని నిర్మించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు