Salaar Collections in Japan : జపాన్ బాక్స్ ఆఫీస్ పై డార్లింగ్ డామినేషన్… అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సలార్

Salaar Collections in Japan : ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సాలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్’ ఇండియన్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీస్‌ను డామినేట్ చేసింది. భారత్‌లో రూ.700 కోట్లు రాబట్టిన తర్వాత, ప్రభాస్ నటించిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీగా సరికొత్త రికార్డు సృష్టించింది.

జపాన్‌లో సలార్ కలెక్షన్స్

‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ జపాన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇండియాలో రిలీజ్ అయిన 7 నెలల తరువాత జపాన్ లో ఈ మూవీ రిలీజైంది. జూలై 5న జపాన్‌లో దాదాపు 200 స్క్రీన్‌లలో రిలీజైన సలార్ మొదటి వీకెండ్ లో 18.22 మిలియన్ జపనీస్ యెన్ (113 వేల US డాలర్లు) వసూలు చేసింది. అయితే ఈ మూవీ ఇంకా ప్రభాస్ హీరోగా నటించిన సాహొ రికార్డును అధిగమించకపోవడం గమనార్హం. ప్రస్తుతానికైతే జపాన్ లో అత్యధిక ఓపెనింగ్స్ భారతీయ సినిమాల లిస్ట్ లో సలార్ మూడవ స్థానంలో ఉంది.

ఇండియన్ సినిమాలకు పెరిగిన ఆదరణ

సలార్ సినిమా జపాన్ లో భారీ స్థాయిలో విడుదల కావడంతో స్ట్రాంగ్ స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే జపాన్ బాక్స్ ఆఫీసు అనేది కేవలం ఒక వారాంతం లేదా ఒక వారం ద్వారా అంచనా వేయలేని మార్కెట్. అక్కడ సినిమాలు ఎక్కువ కాలం నడుస్తాయి. కలెక్షన్లు చాలా తక్కువగా ఉంటాయి. ఇటీవలి సంవత్సరాలలో జపాన్‌లో భారతీయ చిత్రాల విడుదల పెరిగింది. భారతీయ సినిమా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడంతో అక్కడ విడుదలైన పలు ఇండియన్ సినిమాలకు కలెక్షన్లు బాగానే వచ్చాయి.

- Advertisement -

salaar, salaar worldwide collection, salaar collection, salaar collection day 19, salaar box office collection, salaar box office collection day 19, salaar box office collection day 18, salaar box office collection sacnilk, prabhas, prabhas salaar, prithviraj sukumaran, prashanth neel

అయితే ఈ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ ను జక్కన్న తన పేరు మీద రాసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో విడుదలై, 45 మిలియన్లు జపనీస్ యెన్ లు కొల్లగొట్టింది. ఆ తరువాత అంటే రెండవ స్థానంలో ప్రభాస్ సాహో ఉంది. ఈ మూవీ జపాన్ లో 23 మిలియన్లు జపనీస్ యెన్ సాధించింది. ఇక ఆ తర్వాత విడుదలైన సినిమాలేవీ పెద్దగా అక్కడ వసూళ్లు రాబట్టలేదు. కానీ సలార్ మాత్రం మూడవ జపాన్ లో మూడవ బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా రికార్డును క్రియేట్ చేయడం గమనార్హం. అయితే త్వరలోనే సలార్ 28 మిలియన్ యెన్లకు చేరుకునే ఛాన్స్ ఉంది. ఈ సినిమా కలెక్షన్ల జోరు ఎలా ఉంటుందో చూడాలంటే మరో రెండు రోజులు లేదా వారాలు ఆడితే మంచిది. ఆ తరువాత స్థానాల్లో షారుక్ పఠాన్ మూవీ 14 మిలియన్ యెన్, దంగల్ 12 మిలియన్ యెన్ లతో సరిపెట్టుకున్నాయి.

జపాన్‌లో పెరుగుతున్న ఆదరణ

ఇటీవలి సంవత్సరాలలో జపాన్‌లో భారతీయ చలనచిత్రాల హవా బాగా పెరిగింది. ఇది ఇండియన్ సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కు పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనం. భారతీయ సినిమా తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభించడంతో ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మరిన్ని సినిమాలు జపాన్ లో విజయాన్ని సాధిస్తే, ఇది జపాన్ మార్కెట్‌లో ఇండియన్ సినిమాల స్థిరమైన ఉనికికి దారి తీస్తుంది. రానురానూ జపాన్ మన చిత్రాలకు ముఖ్యమైన మార్కెట్‌గా మారవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు