Saripodhaa Sanivaaram Collections : ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ కొట్టేసాడు.. అది కూడా “శనివారమే”..

Saripodhaa Sanivaaram Collections : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “సరిపోదా శనివారం” సినిమా ఆగష్టు 29న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ కే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలిరోజు డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా, తర్వాత స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది. నాని (Nani) – వివేక్ ఆత్రేయ (vivek atreya) కాంబోలో అంటే సుందరానికి సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఆడియన్స్ భారీగా అంచనాలు పెట్టుకోగా, మరీ ఓ రేంజ్ లో కాకపోయినా, డీసెంట్ గానే మెప్పించింది. మొదటి వారం రోజుల్లో మంచి వసూళ్లనే సాధించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మాత్రం కాలేదు. కానీ రెండో వీకెండ్ లో బాగా పుంజుకుందని చెప్పాలి. థియేటర్లు కాస్త తగ్గినా స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది.

Saripodhaa Sanivaaram 10 days Collections

ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకున్న సరిపోదా శనివారం..

ఇక సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) ప్రీమియర్స్ నుండే ఓవర్సీస్ లో భారీ వసూళ్లు సాధించగా, మిగతా ఏరియాల్లో అంతగా జోరు చూపలేదు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదల ప్రభావం వల్ల చాలా చోట్ల కలెక్షన్లు తగ్గాయి. అయినా సరే హోల్డ్ చూపించింది. ఇక వర్కింగ్ డేస్ లో తడబడినా, మళ్ళీ రెండు వీకెండ్ లో బాగా పుంజుకుంది. తాజాగా ఈ సినిమా పది రోజుల కలెక్షన్ల వివరాలు రాగా, ఫైనల్ గా సరిపోదా శనివారం బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుందని చెప్పాలి. పదో రోజు స్ట్రాంగ్ హోల్డ్ చూపించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3.43 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా పది రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుంది. పది రోజుల్లో సరిపోదా శనివారం సినిమా వరల్డ్ వైడ్ గా 44. 30 కోట్ల షేర్, 83 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది.

- Advertisement -

వంద కోట్ల దిశగా సరిపోదాశనివారం..

ఇక సరిపోదా శనివారం సినిమా బ్రేక్ ఈవెన్ కూడా శనివారమే పూర్తి చేసుకోవడం విశేషం. కాగా పదకొండో రోజు ఆదివారం వీకెండ్ తో ఈ సినిమా మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ చూపించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 2.43 కోట్ల ప్రాఫిట్ తో ఉన్న ఈ సినిమా మరిన్ని లాభాలు అందుకునే దిశగా దూసుకుపోతుండగా, వంద కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పోటీ లేకపోయినా ఇతర రాష్ట్రాల్లో వేరే సినిమాల పోటీ వల్ల, ఈ సినిమా రన్ ఆల్మోస్ట్ పూర్తయిందని చెప్పాలి. మరి రానున్న రోజుల్లో నాని సినిమా ఎంత వరకు లాభాలు రాబడుతుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు