Stree2 : ఏకంగా కల్కిని దాటేసిన స్త్రీ2.. ఊహించని రికార్డు ఇది..

Stree2 : బాలీవుడ్ లో ఈ ఇయర్ విడుదలైన సినిమాల్లో అంచనాలను అందుకున్న సినిమా ఒక్కటీ లేదని చెప్పాలి. సైతాన్, క్రూ లాంటి చిన్న సినిమాలే తప్ప పెద్ద సినిమాలు ఒక్కటీ ఆకట్టుకోలేదు. కానీ ఈ ఇయర్ రిలీజ్ అయిన ఓ చిన్న సినిమా మాత్రం పెద్ద సినిమాలని మించి బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతుంది. ఆ సినిమా పేరు “స్త్రీ2”. శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) మెయిన్ లీడ్ లో నటించిన హారర్ మూవీ “స్త్రీ2”. ఈ సినిమా గతంలో వచ్చిన స్త్రీ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కగా, ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా థియేటర్లలో రిలీజ్ అవగా, ప్రీమియర్స్ నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్లు కొల్లగొడుతుంది.

'Stree 2' breaks Prabhas Kalki2898AD records

 

- Advertisement -

ఏకంగా కల్కి రికార్డ్ బ్రేక్…

ఇక ఈ ఇయర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న స్త్రీ2 (Stree2) సినిమా రిలీజ్ రోజు నుండే రికార్డులు బ్రేక్ చేస్తుంది. తొలిరోజు ఓపెనింగ్స్ లోనే బాలీవుడ్ లో అల్ టైం టాప్2 ఓపెనింగ్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ వీక్ లో అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. అన్ని రకాల థియేటర్లలోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తున్న స్త్రీ2 తాజాగా ఓ మాస్ రికార్డ్ నమోదు చేసింది. ఈ ఇయర్ లో హిందీలో రిలీజ్ అయిన సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898AD) సినిమా హిందీలో ఏకంగా 293 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ హిందీ గ్రాసర్ గా నిలిచింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు కల్కి రికార్డులు కూడా బ్రేక్ చేసేసింది స్త్రీ2. రిలీజ్ రోజు నుండే మాస్ కలెక్షన్లతో రచ్చ చేస్తున్న స్త్రీ2 కేవలం 8 రోజుల్లోనే కల్కి ని బ్రేక్ చేయడం విశేషం.

500 కోట్ల దిశగా స్త్రీ2..

ఇక శ్రద్దా కపూర్ నటించిన స్త్రీ2 8 రోజుల్లో కల్కి మూవీ (293 కోట్లు) రికార్డులని బ్రేక్ చేసింది. స్త్రీ2 7 రోజుల్లో 289 కోట్ల వసూళ్లు రాబట్టగా, 8 వ రోజుతో కల్కి మూవీ టోటల్ హిందీ కలెక్షన్స్ ని క్రాస్ చేసి ఏకంగా 300 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. లాంగ్ హాలిడే వీకెండ్ స్త్రీ2 సినిమాకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఇక స్త్రీ2 సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 400 కోట్ల వసూళ్లు దాటేయగా 500 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు