Stree 2 Collections : దెయ్యం అందాలకు వచ్చిన కలెక్షన్స్ 500 కోట్లు… ఎన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయంటే?

Stree 2 Collections : బాలీవుడ్ లో పంద్రాగస్టుకు రిలీజ్ అయిన దెయ్యం సినిమా స్త్రీ2 ఊహించని వసూళ్లు సాధిస్తూ, పలు రికార్డులను తిరగరాస్తుంది. ఈ ఇయర్ హిందీలో విడుదలైన సినిమాల్లో అంచనాలను అందుకున్న స్టార్ హీరో సినిమా ఒక్కటీ లేదని చెప్పాలి. సైతాన్, క్రూ లాంటి చిన్న సినిమాలే తప్ప పెద్ద సినిమాలు ఆకట్టుకోలేదు. అయితే ఇప్పుడు చిన్న సినిమాగా రిలీజ్ అయిన మరో సినిమా బాలీవుడ్ లో సంచలన వసూళ్లు సాధిస్తుంది. శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) మెయిన్ లీడ్ లో నటించిన హారర్ మూవీ “స్త్రీ2” మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా గతంలో వచ్చిన స్త్రీ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కగా, ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా థియేటర్లలో రిలీజ్ అయి, ప్రీమియర్స్ నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్లు కొల్లగొడుతుంది.

Stree2 Movie joined the 500 crore club

ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ గా స్త్రీ2..

ఇక ఈ ఇయర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న స్త్రీ2 (Stree2) సినిమా తొలి రోజు నుండే రికార్డులు బ్రేక్ చేస్తుండగా, ఫస్ట్ డేనే అల్ టైం టాప్2 ఓపెనింగ్ తెచ్చుకోగా, ఏకంగా తొలివారం 300 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు సాధించింది. రీసెంట్ గా ప్రభాస్ (Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898AD) సినిమా హిందీకలెక్షన్లను కూడా క్రాస్ చేసిన స్త్రీ2 హిందీలో ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఫైటర్ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసి 2024 లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా స్త్రీ2 నిలిచింది. ఇక రెండో వీకెండ్ లో కూడా సెన్సేషనల్ వసూళ్లు అందుకున్న ఈ దెయ్యం సినిమా మరో అరుదైన రికార్డ్ అందుకుంది.

- Advertisement -

500 కోట్ల క్లబ్ లో స్త్రీ2..

శ్రద్దా కపూర్ నటించిన స్త్రీ2 8 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 400 కోట్ల వసూళ్లు దాటేయగా, తాజాగా ఏకంగా 500 కోట్ల మార్క్ దాటేసింది. రెండో వీకెండ్ లో కృష్ణాష్టమి హాలిడే వీకెండ్ లో మరోసారి అదిరిపోయే వసూళ్లు అందుకున్న స్త్రీ2 ఇండియాలోనే 400 కోట్ల వసూళ్లు సాధించగా, వరల్డ్ వైడ్ గా 500 కోట్ల క్లబ్ లో చేరిపోయిందని సమాచారం. ఇక బాలీవుడ్ లో ఇండియాలో అత్యధిక వసూళ్లు అందుకున్న టాప్ 10 సినిమాల్లో ఒకటిగా స్త్రీ2 నిలిచింది. లాంగ్ రన్ లో మరో వంద కోట్లు రాబట్టడం ఖాయం అని అంటున్నారు నెటిజన్లు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు